ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi liquor scam case )లో సీబీఐ విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha ) రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు.ఈ మేరకు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి నిన్న కోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.ఈ ఉత్తర్వులను కవిత తరపు న్యాయవాది రౌస్ అవెన్యూ కోర్టులో ప్రస్తావించారు.
దరఖాస్తును సీబీఐ( CBI ) తమకు అందించలేదని తెలిపారు.ఈ క్రమంలోనే పిటిషన్ పై విచారణ చేపట్టాలని న్యాయస్థానాన్ని కవిత తరపు లాయర్ కోరారు.ఈ నేపథ్యంలో పిటిషన్ ను స్వీకరించిన రౌస్ అవెన్యూ కోర్టు విచారణ తేదీని ఇవాళ చెబుతామని వెల్లడించింది.అయితే లిక్కర్ కేసులో కవితను విచారించేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో వచ్చే వారం ఆమెను తీహార్ జైలు( Tihar Prison )లో ప్రశ్నించేందుకు సీబీఐ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.