విశాఖ దొండపర్తి పరదేశమ్మ గుడి దగ్గర లో ఎమ్మెల్యే వాసుపల్లి గారు నిర్వహించిన ప్రజాదర్బార్ కి విశేష ఆదరణ విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలోని 41&27 వార్డ్స్ దొండపర్తి పరదేశమ్మ గుడి దగ్గర లో విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు గౌ”శ్రీ”వాసుపల్లి గణేష్ కుమార్ గారు ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం కోసం నిర్వహించిన ప్రజాదర్బార్ లో అనేక మంది ప్రజలు విచ్చేశారు.ముఖ్యంగా నార్త్ నియోజకవర్గానికి చెందిన వికలాంగ మహిళకు TIDCO ఇల్లు నిలుపుదల చేశారని పిర్యాదు వచ్చిన వెంటనే ఎమ్మెల్యే గారి కార్ పై పంపించి సచివాలయం అడ్మిన్ &సిబ్బంది తో మాట్లాడి TIDCO ఇల్లు (సంబందించిన పధకం) మంజూరు జేసి త్వరితగతిన న్యాయం చేయాలనీ ఆదేశించారు.
వైజాగ్ పటం క్లబ్ అసోసియేషన్ సభ్యులు బార్ గత రెండు సంవత్సరాలనుండి కరోనా నుండి లైసెన్సు నిలుపుదల చేసిన కారణంగా ప్రస్తుతం విశాఖ లో నాలుగు క్లబ్ లకు పర్మిషన్ ఇచ్చినట్లే ఈ క్లబ్ కి కూడా రెన్యూవల్ చేయాలనీ కోరారు.నిరుద్యోగ యువకులు జాబ్స్ కల్పించాలని , పెన్షన్స్ కొరకు, కొన్ని కారణాల వలన అమ్మఒడి రానివారు, పాడైన రోడ్లు, కాలువలు పునఃనిర్మాణం కొరకు, అంగనవాడి భవనాలు పునరుద్ధరణ కొరకు, వీధి దీపాలు వెలిగించాలని వినతి పత్రాలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు వార్డ్ ప్రెసిడెంట్స్, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, వైస్సార్సీపీ స్టేట్ నాయకులు, జిల్లా సీనియర్ నాయకులు, వైస్సార్ సెంట్రల్ పార్క్ వాకర్స్ క్లబ్ అసోసియేషన్ మెంబర్స్ & కార్యకర్తలు మరియు అనేక మంది ప్రజలు హాజరయ్యారు.మరియు ప్రభుత్వ అధికారులు VRO, హోసింగ్ WI, జీవీఎంసీ వాటర్ సప్లై, టౌన్ ప్లానింగ్, ఎలక్ట్రికల్, యుజీడీ, సివిల్, శానిటేషన్ సిబ్బంది తదితరులు హాజరై ఎమ్మెల్యే గారి సమక్షంలో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.