ల్యాండ్ చూపిస్తానంటూ రియల్టర్ను కిడ్నాప్ చేసి ఇ కోటి రూపాయలు డిమాండ్ చేసిన రౌడీషీటర్ పోలీసుల వెంటాడడం తో రియాల్టర్ ను కారు నుంచి కిందకి తోసి పరారైన రౌడీషీటర్ విశాఖలో రియల్టర్ పోలీసుల జోక్యంతో కిడ్నాపర్ల నుంచి బయట పడ్డాడు.నగరంలో పలు హత్యలతో సంబంధం ఉన్న ఓ రౌడీ షీటర్ కిడ్నాప్నకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఆ ముఠా కోసం పోలీసు ప్రత్యేక బృందాలు గాలింపు మొదలుపెట్టాయు.
ప్రస్తుతం భీమిలిలో వాచీ రామకృష్ణ అనే రియల్టర్ వ్యాపారం చేస్తున్నాడు టిడిపిలో కూడా క్రియాశీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు ఈ దశలో తగరపువలస ప్రాంతానికి చెందిన కోల హేమంత్ అనే రౌడీ షీటర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం తో సంబంధాలు ఉన్నట్టు రామకృష్ణ తో పరిచయం పెట్టుకున్నాడు ఆ క్రమంలో ఆ స్థలం కొనుగోలు విషయంపై మాట్లాడాలని నిన్న సాయంత్రం ఋషికొండ వద్దకు పిలిపించారు.
మరో వ్యక్తి తో కలిసి వెళ్లిన రామకృష్ణ పై దాడి చేసి తాళ్లతో కట్టి కారులో రౌడీషీటర్ హేమంత్ తగరపువలస నుంచి విజయనగరం వైపు కిడ్నాప్ చేశాడు అసెంబ్లీలో విడిచి పెట్టడానికి కోటి రూపాయలు డిమాండ్ చేశాడు అయితే 50 లక్షలు ఇవ్వడానికి రామకృష్ణ అంగీకరించాడు అసెంబ్లీలో సమాచారం తెలిసిన విశాఖ పోలీసులు కిడ్నాపర్ల కారును వెంబడించారు దీంతో కిడ్నాపర్లు రియల్టర్ రామకృష్ణను కారులోంచి కిందకి తోసేసి పరారయ్యారు.ప్రస్తుతం పోలీసులు కోల హేమంత్ తో పాటు కిడ్నాపర్ల ముఠా గురించి గాలిస్తున్నారు.
కోలా హేమంత్ విశాఖ నగరంలో ఐదేళ్ల క్రితం ఇల్లు విక్రయిస్తామని అంటూ పరిచయం చేసుకొని విజయ రెడ్డి అనే మహిళ కాంగ్రెస్ నాయకురాలుని కూడా హత్య చేశాడు.