ఖమ్మం జిల్లాలో నకలీ మందుల తయారీ వ్యవహారం గుట్టు రట్టైంది.జిల్లాలో ఉన్న ఫార్మా కంపెనీలో నకిలీ మందులను తయారు చేస్తున్నట్లు డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు.
ఈ మేరకు కంపెనీని సీజ్ చేసిన అధికారులు రూ.4.35 కోట్లు విలువైన నకిలీ మందులను స్వాధీనం చేసుకున్నారు.ఫార్మా కంపెనీ నిర్వాహకులు కదారి సతీశ్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి ఈ మందులను తయారు చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు.
ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.