భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లంపీ స్కిన్ వైరస్ కలకలం సృష్టిస్తోంది.పాల్వంచలోని జగన్నాథపురంలో ఓ రైతుకు చెందిన పశువులకు దద్దుర్లు వచ్చాయి.
దీంతో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు.పశువులను పరిశీలించిన పశు వైద్యులు వాటికి లంపీ స్కిన్ వైరస్ సోకినట్లు గుర్తించారు.
వ్యాధి సోకిన పశువులకు 105 డిగ్రీల జ్వరం వస్తుందని తెలిపారు.అదేవిధంగా ఆ పశువులను మిగతా పశువులకు దూరంగా ఉంచాలని రైతులకు సూచించారు.
ఈ మధ్య కాలంలో పశువుల్లో లంపీ స్కిన్ వ్యాధి సోకుతున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.