సీబీఐ అధికారినని అని చెప్పుకుంటూ ప్రముఖులని బెదిరించడం, దందాలు చేయడం ఓ హీరోయిన్ పనిగా పెట్టుకుంది.సినిమాలో హీరోయిన్ గా రాణించిన కూడా ప్రియుడుతో కలిసి తప్పుడు మార్గంలో వెళ్లి ఇప్పుడు పోలీసులకి అడ్డంగా బుక్ అయ్యింది.
రెడ్ చిల్లీస్, మద్రాస్ కేఫ్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన లీనా కోసం ఇప్పుడు పోలీసులు గాలిస్తున్నారు.మాజీ ఎంపీ, వ్యాపారవేత్త రాయపాటి సాంబశివరావుకి సిబీఐ ఆఫీసర్ ని అన్ని చెప్పి లీనా బెదిరింపులకి పాల్పడింది.
దీనిపై ఆయన పోలీసులకి ఫిర్యాదు చేయడంతో అసలు నిజాలు బయటకి వచ్చాయి.
లీనాకు అనుచరు గడచిన జనవరిలో లీనా అనుచరుడు రాయపాటి దగ్గరకు వచ్చి, తాను సీబీఐ అధికారినని చెప్పి డబ్బు డిమాండ్ చేయడంతో, ఆయన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
తరువాత వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తే లీనా వ్యవహారం వెలుగులోకి వచ్చింది.దీంతో ఆమెతో పాటు ఆమె ప్రియుడు మీద కేసు నమోదు చేసి లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశామని అధికారులు తెలిపారు.
ఆమె పరారీలో ఉందని తెలిపారు.ఇప్పటికే లీనాపై చాలా కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయని, ఆమెను అరెస్ట్ చేస్తే, మొత్తం కేసులోని చిక్కుముడులు వీడుతాయని పోలీసు అధికారులు అంటున్నారు.
గతంలో తమిళనాడులో టీటీవీ దినకరన్ ను బెదిరించారన్న కేసు కూడా లీనాపై విచారణ దశలో ఉంది.