దేవిక… ఒక తెలుగు సినిమా నటి.1960, 70 దశకాలలో అందాల తారగా తెలుగు, తమిళ సినీరంగాలలో వెలుగొందారు.తెలుగు, తమిళ, మలయాళంలలో 150కి పైగా సినిమాలలో నటించి గొప్ప పేరును సంపాదించుకున్నారు.రంగస్థల నటిగా జీవితాన్ని ప్రారంభించిన దేవిక ఎస్.వి.సహస్రనామం బృందం ప్రదర్శించిన అనేక నాటకాలలో వివిధ పాత్రలు పోషించారు.
అలనాటి నటి దేవిక తన 20 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో విజయాలను అందుకున్నారని సినీ విమర్శకులు వాసిరాజు ప్రకాశం తెలిపారు.తన పరిధిలో ఎంత వరకు నటించగలదో అంత వరకు నటించే వారని ఆయన అన్నారు.
అయితే ఆమె ఒక డైరెక్టర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంటే .అతను మాత్రం ఈమె డబ్బును చూసి వివాహం చేసుకున్నాడని ఆయన అన్నారు.కొంత కాలం తరువాత వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి.ఎందుకంటే అతని చూపంతా కేవలం ఆమె ప్రాపర్టీ మీదనే ఉండేది.
అయితే నటి దేవికకు మాత్రంఆస్తి అంతస్తులు పై ఏమాత్రం ఇష్టం లేకపోవడమే కాకుండా ఆమె తన భవిష్యత్ అంతా కుటుంబంతో గడపాలని ఉండేది.
దాంతో దేవిక డైరెక్టర్ వైవాహిక జీవితంలో ఎన్నో బేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి.ఈ మనస్పర్థల కారణంగా వీరికి అందమైన జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయని వాసిరాజు తెలిపారు.ఆమె భర్త పేరు దేవదాస్ అన్న వాసిరాజు… అతనికి ఒక చిన్న ఎల్ ఐ సీ కంపెనీ ఉండేదని ఆయన అన్నారు.
అది ఆయన సరిగా మేనేజ్ చేయలేక కనీసం అతను దాని అద్దె కూడా కట్టలేకపోయాడని ఆయన తెలిపారు.ఆ విధంగా దేవిక జీవితం పతనం అయిందని వాసిరాజుప్రకాశం ఒక ఇంటర్వ్యూ సందర్భంగా నటి దేవిక తెర వెనుక పడిన కష్టాలను తెలియజేశారు.