కోలీవుడ్ హీరోలు కూడా మన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.ఎందుకంటే చాలా మంది హీరోలు తమ సినిమాలను తమిళ్ తో పాటు తెలుగులో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తూ ఉంటారు.
మరి అలా డబ్బింగ్ సినిమాలతో అలరించే స్టార్ హీరోల్లో అజిత్ కుమార్ ఒకరు.కోలీవుడ్ లో బిగ్గెస్ట్ మాస్ హీరో అజిత్ సినిమా వస్తుంది అంటే అక్కడ మాములు అంచనాలు ఉండవు.
మరి ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ సినిమా ”తునివు” మీద కూడా చాలా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది.దక్షిణాదిలో అతి పెద్ద సీజన్ ఏది అంటే అది సంక్రాంతి సీజన్ అనే చెప్పాలి.మరి ఈ సీజన్ లో ఈసారి నలుగురు స్టార్ హీరోలు పోటీ పడబోతున్నారు.2023 సంక్రాంతికి కోలీవుడ్ నుండి కూడా రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.అందులో ఒకటి విజయ్ దళపతి నటించిన వారసుడు కాగా.
మరొకటి అజిత్ కుమార్ నటించిన తునివు.
హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 12న వరల్డ్ రిలీజ్ కానుంది.
ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీ సేల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి.బుకింగ్ వెబ్ సైట్స్ ప్రకారం ఈ సినిమా రన్ టైం బయటకు వచ్చింది.
ఈ సినిమా మొత్తం నిడివి 2 గంటల 45 నిముషాలుగా ఉంది.మరి ఈ సుదీర్ఘమైన రన్ టైం ప్రేక్షకులను ఏ మేర ఆకట్టు కుంటుందో చూడాలి.
ఇక ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తుండగా.బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి పతాకంపై బోణీ కపూర్ నిర్మించారు.అలాగే మంజు వారియర్ హీరోయిన్ గా నటించింది.అలాగే సముద్రఖని కూడా కీలక పాత్రలో నటించాడు.చూడాలి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టు కుంటుందో.