కృష్ణ మరియు విజయ నిర్మల సినిమాల్లో నటిస్తూ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే.ఇందిరా వంటి అందమైన భార్య ఉన్నప్పటికి విజయ నిర్మల వ్యక్తిత్వం నచ్చడం తో ఆమెతో ప్రేమలో పడ్డాడు కృష్ణ.
ఇద్దరు తమ ప్రేమ విషయం దాచాలనుకోలేదు.కృష్ణ విజయ నిర్మలతో ప్రేమలో ఉన్నాడనే విషయం అప్పట్లో అందరికి తెలుసు.
ఎవరు వారి బంధాన్ని తప్పు పట్టకపోవడం నిజంగా ఆశ్చర్యపడే విషయం.అంతలా వారి నిజమైన ప్రేమకు అందరు దాసోహం అన్నారు.
ఇక పెళ్లి తర్వాత కూడా ఇద్దరు విడివిడిగా హీరో హీరోయిన్స్ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు.కొన్నేళ్ల పాటు వారి ప్రేమ బంధం కొనసాగింది.
విజయ నిర్మల ఎక్కడ ఉంటె అక్కడే కృష్ణ ఉండేవారు.అప్పట్లో ఊటీ లో ఉన్న, మద్రాసు నుంచి కృష్ణ గారు కారు వేసుకొని వెళ్ళిపోయేవారు.ఇక ఎన్ని సినిమాల్లో నటిస్తున్న వచ్చే డబ్బు విషయంలో విజయ నిర్మల జోక్యం చేసుకునే వారు కాదు.ఆమె తన తల్లిదండ్రులపైననే ఎక్కువగా ఆధారపడేది.
ఆమెకు ఏం కావాలన్న కూడా వారే చూసుకునే వారు.ఒక రోజు కృష్ణ మరియు విజయ నిర్మల అప్పుడే కొత్తగా వచ్చిన డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ కి వెళ్లారట.
అప్పట్లో డ్రైవ్ ఇన్ రెస్టారెంట్స్ కి బలే క్రేజ్ ఉండేది.ఇద్దరు సెలబ్రిటీలు మాములుగా హోటల్ కి వెళితే అభిమానుల కోలాహలం ఉంటుంది కాబట్టి ఆ రోజు ఆలా ప్లాన్ చేసుకున్నారట.

ఇక రెస్టారెంట్ కి వెళ్ళగానే వారికి కావాల్సినవన్నీ తెప్పించుకొని తినేశారట.తీరా తిన్నాక చూస్తే ఇద్దరి జేబుల్లో డబ్బు లేదు.దాంతో ఒకరి మొహాలు ఒకరు చూసుకొని ఏం చేయాలా అని కంగారు పడ్డారట.ఇక అక్కడ పని చేసే ఒక పిల్లాడిని తీసుకొని కారు లో ఎక్కించుకొని ఇంటికి వెళ్ళాక డబ్బు ఇచ్చి పంపించారట.
ఇలా కృష్ణ గారు బయటకు తీసుకెళ్లి సరదాగా ఇబ్బంది పెట్టారంటూ ఒక ఇంటర్వ్యూ లో విజయ నిర్మల తెలిపారు.ఇక ఆ సంఘటన తర్వాత ఎక్కడికి వెళ్లిన తాను కూడా డబ్బు పట్టుకొని వెళ్లడం అలవాటు చేసుకున్నారట.