టాలీవుడ్ హీరో అను ఇమ్మాన్యుయేల్ నటించిన తాజా చిత్రం ఊర్వశివో రాక్షసివో.ఇందులో అల్లు శిరీష్ హీరోగా నటించిన విషయం తెలిసిందే.
కాగా ఈ సినిమా నేడు అనగా నవంబర్ 4న విడుదల అయ్యింది.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే సినిమా విడుదలకు ముందు పలు ఇంటర్వ్యూలలో పాల్గొంది అను ఇమ్మాన్యుయేల్.
ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ.నేను మొదట ఊహించని విధంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను.
అలా మొదట మజ్ను సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాను.ఆ తర్వాత పలు సినిమాలలో నటించాను.
కొన్ని సినిమాలు ప్లాప్ మరికొన్ని సినిమాలు హిట్ అయినప్పటికీ నాకు మంచి గుర్తింపు దక్కింది అని చెప్పుకొచ్చింది.ఈ క్రమంలోనే అల్లు శిరీష్ తో డేటింగ్ అన్న వార్తలపై ఆమె స్పందిస్తూ.
నేను అల్లు శిరీష్ డేటింగ్ లో ఉన్నాము అంటూ వార్తలు వినిపించాయి.ఆ వార్తలు అని నేను చదవలేదు కానీ మా అమ్మ వార్తలను బాగా ఫాలో అవుతుంది ఆ వార్తలను చదివి చాలా బాధపడింది.
కానీ నేను అలాంటి వార్తలను పెద్దగా పట్టించుకోను.కానీ అమ్మ బాధను చూడలేక నేను కూడాబాధపడ్డాను కానీ ఒక విషయం చెప్పాలి.
ఊర్వశివో రాక్షసివో సినిమాకు ముందు అల్లు శిరీష్ ని నేను కలవలేదు పూజ రోజు మాత్రమే కలిశాను అది కూడా మొదటిసారి అని చెప్పుకొచ్చింది అను ఇమ్మానుయేల్.

ఈ సినిమా కథను డైరెక్టర్ వినిపించిన తర్వాత నేను అల్లు శిరీష్ కాఫీ షాప్ లో కూర్చుని మాట్లాడుకున్నాము.ప్రస్తుత రోజుల్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి టీ తాగితేనే రకరకాల వార్తలను సృష్టిస్తూ ఉంటారు.కానీ అటువంటి వార్తలను నేను పెద్దగా పట్టించుకోను.
అల్లు అర్జున్తో నా పేరు సూర్య సినిమా చేసినప్పటి నుంచి అరవింద్ గారి ఫ్యామిలీతో నాకు మంచి అనుబంధం ఉంది.అల్లు శిరీష్ నేను డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వినిపించడంతో అల్లు అరవింద్ గారు కూడా నన్ను అడిగారు ఆ గాసిప్ కి మేమిద్దరం నవ్వుకున్నాము అని చెప్పుకొచ్చింది అను ఇమ్మాన్యుయేల్.







