వంటగది శుభ్రంగా ఉండాలంటే బెస్ట్ చిట్కాలు

మనం ప్రతి రోజు వంట చేసే వంటగదిని శుభ్రంగా ఉంచుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు.వంట పూర్తి అయిన వెంటనే వంటగదిని శుభ్రం చేయాలి.

 Useful Kitchen Cleaning Tips And Tricks-TeluguStop.com

కూరగాయాల తుక్కును ఎప్పటికప్పుడు బయట పాడేస్తూ ఉండాలి.వంటగది,స్టవ్,మైక్రో ఒవేన్ వంటి వాటిని నిమ్మరసం,బేకింగ్ సోడా వంటి వాటితో శుభ్రం చేస్తే జిడ్డు,మురికి తొలగిపోయి శుభ్రంగా ఉంటాయి.

వంట చేసే సమయంలో గ్యాస్ స్టవ్ మీద ఏవో ఒకటి పడుతూనే ఉంటాయి.వాటిని తుడవకపోతే మొండి మరకలుగా మారిపోతాయి.అందువల్ల ఎప్పటికప్పుడు స్టవ్ ని శుభ్రం చేయాలి.మైక్రో వేవ్ వాడిన వెంటనే శుభ్రం చేసుకోవాలి.లేకపోతె మైక్రో వేవ్ లో వండిన ఆహార పదార్ధాల వాసన అలానే ఉండిపోతుంది.మైక్రో వేవ్ ని శుభ్రం చేయటానికి మెత్తని క్లాత్,బేకింగ్ సోడా ఉపయోగించాలి.

గిన్నెలను తోమిన వెంటనే సింక్ లో వెనిగర్,ఉప్పు వేసి బ్రష్ సాయంతో శుభ్రం చేయాలి.ఉప్పు మరకలను తొలగిస్తే,వెనిగర్ పదార్ధాల వాసనను పోగొడుతుంది.వంట చేసిన సామాను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.ఆలా వదిలేస్తే ఆ పాత్రల మన్నిక తగ్గిపోతుంది.

కాబట్టి ఈ చిట్కాలను పాటిస్తే వంటగది శుభ్రంగా ఉండటమే కాకుండా మన ఆరోగ్యం కూడా బాగుంటుంది.

వంటగదిని శుభ్రం చేయటానికి నిమ్మరసం,బేకింగ్ సోడా,వెనిగర్ వంటి వాటిని ఉపయోగించాలి.

ఎందుకంటే వీటిలో ఉండే లక్షణాలు జిడ్డును,మురికిని తొందరగా వదిలేలా చేస్తాయి.అందువల్ల వీటిని ఉపయోగించి వంటగదిని శుభ్రంగా ఉంచుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube