2023 సంవత్సరంలో బలగం మూవీ( Balagam movie ) చిన్న సినిమాలలో పెద్ద హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే.ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఎమోషనల్ సీన్స్ వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు తెగ నచ్చింది.
బలగం సినిమా ద్వారా గుర్తింపును సొంతం చేసుకున్న నటి కొమ్ము సుజాత( Actress Kommu Sujata ) ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.
రైటర్ కమ్ కో డైరెక్టర్ నాగరాజు ( Writer cum director Nagaraju )ఫ్రెండ్ ద్వారా నేను అడిషన్ కు వెళ్లానని అలా బలగం మూవీలో ఛాన్స్ వచ్చిందని కొమ్ము సుజాత పేర్కొన్నారు.
అడిషన్ లో సెలెక్ట్ కావడానికి నాలుగు నెలల ముందు నాన్న చనిపోయారని ఆమె చెప్పుకొచ్చారు.గతంలో కొన్ని సినిమాలలో ఛాన్స్ వచ్చి ఆ తర్వాత పోయిందని ఆ సమయంలో ఏడ్చానని కొమ్ము సుజాత కామెంట్లు చేశారు.
ఇండస్ట్రీ అలవాటు అయ్యేవరకు ఏడ్చానని ఆమె అన్నారు.
బలగం ఈ రేంజ్ లో బంపర్ హిట్ అవుతుందని ఊహించలేదని ఈ సినిమా ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించిందని కొమ్ము సుజాత తెలిపారు.మహాతల్లి ఒకావిడ నేను పనిమనిషి పాత్రకు కూడా పనికిరానని కామెంట్ చేసిందని ఇండస్ట్రీకి ఎందుకు వచ్చావని అడిగిందని కొమ్ము సుజాత వెల్లడించారు.అలా అన్న వ్యక్తి పేరు చెప్పలేనని ఆమె పేర్కొన్నారు.
అలాంటి కామెంట్లను పట్టించుకోవద్దని నా భర్త సూచించారని కొమ్ము సుజాత తెలిపారు.
బయటకు వచ్చి బ్రతకడం సులువు కాదని అమె కామెంట్లు చేయడం గమనార్హం.ప్రతి కుక్కకు ఒకరోజు వస్తుందని కొమ్ము సుజాత తెలిపారు.నా యాక్టింగ్ బాగుందని చెబితే మాత్రం నేను చెట్టు ఎక్కేస్తానని కొమ్ము సుజాత కామెంట్లు చేశారు.
నేను రాక్షసినని మా కుటుంబానికి మాత్రమే నా రాక్షసత్వం తెలుసని కొమ్ము సుజాత అభిప్రాయం వ్యక్తం చేశారు.