సంగీతానికి రాళ్లు కరుగుతాయనేది దేవుడికెరుకగాని, ఇపుడు సంగీతానికి జంతువులతో సైతం డ్యాన్స్ చేయించగల సత్తా ఉందని తాజాగా నిరూపితం అయింది.వినడానికి ఆశ్చర్యంగా వున్నా ఇది నిజమే.
ఓ సూపర్ డూపర్ హిట్ సాంగ్ కి ఓ అమ్మాయి స్టెప్పులు వేసి చూపిస్తే ఏనుగు కూడా ఆమెని అనుకరించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.అవును, జంతువులకు మాటలు రాకపోయినా మనుష్యులు చెప్పే ఎన్నో విషయాలు అర్ధం చేసుకోగలవు అనడానికి ఇదే ఉదాహరణగా నిలుస్తోంది అనడంలో సందేహమే లేదు.
అసలు విషయంలోకి వెళితే, ఉత్తరాఖండ్‌లో( Uttarakhand ) ఓ ఏనుగు డ్యాన్స్( Elephant dance ) అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసింది.జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌కి వెళ్లిన ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్ వైష్ణవి నాయక్ ఓ పాటకి డ్యాన్స్ చేయడం ప్రారంభించింది.
ఆమెకు కాస్త దూరంలో ఉన్న ఏనుగు కూడా వైష్ణవిని అనుకరిస్తూ స్టెప్పులు వేయడం మొదలు పెట్టింది.కాగా దీనికి సంబందించిన క్యూట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సాధారణంగా మన ధర్మ శాస్త్రాలు( Dharma Shastras ) పరంగా ఏనుగులుని మనం పూజిస్తాం.అంతేకాదండోయ్ అవి చాలా తెలివైన జంతువులుగా పేరుగాంచాయి.అందుకే వీటిని జనం అమితంగా ఇష్టపడతారు.కాగా వైరల్ అవుతున్న సదరు వీడియోని చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.‘చాలా అద్భుతమైన వీడియో.ఏనుగులు చాలా దయగల జంతువులు.
వాటిని ప్రేమించండి, దయచేసి వాటిమీద ఎక్కి స్వారీ చేస్తూ వాటిని ఇబ్బంది పెట్టద్దని’ కొందరు కామెంట్ చేస్తే, ఏనుగులు బంధించబడి ఉండటం వల్ల ఒత్తిడికి లోనై ఇలా ప్రవర్తిస్తుంటాయని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు.ఈ వీడియోకి మాత్రం లక్షల్లో వ్యూస్ రావడం విశేషం.