ఆ విషయంలో ఇద్దరూ... ఒక్కటేనా ..? ఇబ్బంది పడుతున్నారా ...?

ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండటంతో ఏపీ లోని రాజకీయ పార్టీలు హడావుడి మొదలుపెట్టేశాయి.సాధారణ ఎన్నికలు సాధారణ ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో… తెలంగాణలో కేసీఆర్ అనుసరించిన రాజకీయ వ్యూహాన్ని ఇక్కడ కూడా అమలు చేసేందుకు… టిడిపి, వైసిపి పార్టీలు ప్లాన్ చేశాయి.

 Kcr And Chandrababu Naidu Following Same Procedure-TeluguStop.com

ఈ మేరకు ఇదే నెల రెండో వారంలో పోటీ చేయబోయే అభ్యర్థుల ప్రకటన కూడా ఉంటుందని… ఈ రెండు పార్టీలు ప్రకటించాయి.అయితే వారు ప్రకటిస్తానని చెప్పిన సమయం దాటిపోయింది వారు మాత్రం నోరు మెదపడం లేదు.

కేసిఆర్ విషయానికి వస్తే… అసెంబ్లీ రద్దు చేసిన వెంటనే అభ్యర్థులను ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచాడు.అయితే ఈ విషయంలో టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడంలో మహా కూటమిలో ఉన్న పార్టీలు చివరకు అభ్యర్థులు ఎంపిక చేయకుండా…సస్పెన్స్ కొనసాగించాయి.

ఇదే విషయంపై టిజెఎస్ అధినేత స్పందిస్తూ… కేసీఆర్‌ ముందస్తుగా అభ్యర్థులను నిర్ణయించడమే ఆయన విజయంలో కీలకమైన అంశం అని వ్యాఖ్యానించారు.తను ఇదే విషయాన్ని కాంగ్రెస్‌, టీడీపీ నేతలకు చెప్పానని.పోలింగ్‌కు కనీసం నెలరోజుల ముందు అయినా అభ్యర్థుల ప్రకటన చేయాలని తను పట్టుపట్టానని అయితే వారు తనను పట్టించుకోలేదని కోదండ వాపోయాడు.కేసీఆర్‌ను ఎదుర్కొనాలంటే.ప్రచార పర్వానికి వీలైనంత సమయం కావాలని తను ఎంతచెప్పినా అభ్యర్థుల ప్రకటన ఆలస్యం చేశారని.ముందుగానే అభ్యర్థుల ప్రకటనను చేసుకున్న కేసీఆర్‌ ప్రచారంలో దూసుకుపోయాడని.

ఆ విషయంలో కూటమిలోని పార్టీలకు సీట్ల సర్దుబాటు కాకా సమయం అంతా… వృధా అయ్యిందని ఆ తరువాత అన్ని పార్టీలు బాధపడ్డాయి.

ప్రతి విషయంలోనూ కేసీఆర్ ను అనుసరించే… ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయంలోనూ ఆయన్ను ఫాలో అయిపోతారని అంతా భావించారు.అయితే ఆ విషయంలో ముందు కేసీఆర్ ను ఫాలో అయిపోయినట్టు కనిపించినా…ఆ తరువాత యూ టర్న్ తీసుకున్నారు.ముందుగానే, ముహూర్తాలను పెట్టి.

ఒకేసారి భారీ ఎత్తున అభ్యర్థులను ప్రకటించే ఉద్దేశం లేదని చంద్రబాబు నాయుడు స్పష్టంచేశాడు.దీంతో ముందుగా ఎదురుచూపులు చుసిన వారంతా నిరాశపడ్డారు.

ఇక వైసీపీ నుంచి కూడా కొన్ని ఊహాగానాలు వినిపించాయి.పాదయాత్ర ముగింపు సభలో పార్టీ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని… పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

అయితే ఈ విషయంలో జగన్ కూడా వెనక్కి తగ్గాడు.టీడీపీ అబ్యర్దులను ప్రకటిస్తే అక్కడ చెలరేగిన అసంతృప్తులను తనకు అనుకూలంగా మార్చుకోవాలని వైసీపీ భావించి వెనక్కి తగ్గింది.

ఈ విషయంలో వైసీపీ టీడీపీ రెండు పార్టీలు కూడా… అభ్యర్థుల ప్రకటన విషయంలో ఎటూ… తేల్చుకోలేక సతమతం అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube