శంకర్ డైరక్షన్ లో కమల్ హాసన్ హీరోగా వస్తున్న మూవీ ఇండియన్ 2.పాతికేళ్ల క్రితం సూపర్ హిట్ అయిన ఇండియన్ సినిమాకు సీక్వల్ గా ఇండియన్ 2 వస్తుంది.
అయితే భారీ బడ్జెట్ తో మొదలైన సినిమా మధ్యలో క్రేన్ యాక్సిడెంట్ వల్ల అసిస్టెంట్ డైరక్టర్స్ మృతి చెందారు.ఆ తర్వాత బడ్జెట్ కుదరకనో మరే కారణం వల్లో సినిమా క్యాన్సిల్ చేఏసుకున్నారు.
అయితే కమల్ హాసన్ విక్రం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోగా ఇప్పుడు మళ్లీ ఇండియన్ 2 సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లారు.
ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ ని అనుకున్నారు.
అయితే ఈ సినిమా టైం లోనే ఆమె పెళ్లి చేసుకుంది. ప్రెగ్నెన్సీ టైం లో కాజల్ ఈ సినిమా చేయనని కూడా చెప్పింది.
సినిమా వాయిదా పడే సరికి కాజల్ ఓ బాబుకి జన్మనిచ్చింది.ఇక ఇప్పుడు కాజల్ కూడా ఇండియన్ 2లో నటించడానికి రెడీ అంటుంది.
కాజల్ తో పాటుగా ఇండియన్ 2 సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా నటిస్తుందని తెలుస్తుంది.సో ఇద్దరు భామలతో ఇండియన్ 2 కలర్ ఫుల్ గా ఉండబోతుందని చెప్పొచ్చు.
కాజల్ రీ ఎంట్రీ తో ఆమె ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు.