ఈరోజు స్మార్ట్ ఫోన్ లేనివారు దాదాపు ఉండరనే చెప్పుకోవాలి.అందువలన సోషల్ మీడియా అనేది ఇపుడు బాగా ప్రాచుర్యం పొందింది.
సోషల్ మీడియా వలెనే ఇపుడు ప్రపంచం నలుమూలలా జరిగిన వింతలూ విశేషాలు బయటకు వస్తున్నాయి.ఇక ఇటీవలి కాలంలో ట్రాఫిక్ చలానాలు విషయంలో బాధితులు రకరకాలుగా సోషల్ మీడియాలో స్పందించడం మనకు తెలిసినదే.
తాజాగా అలాంటి ఓ సంఘటనే జరిగింది.ఇకపోతే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.
ట్రాఫిక్ పోలీసులు ఎలాంటి ఫైన్స్? సిగ్నల్ జంపింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడ్, వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్… ఇలా చాలా రకాల ఫైన్స్ ఉంటాయి కదా.
అయితే ఈ క్రమంలోనే పోలీసులు వేసే కొన్ని రకాల ఫైన్స్ వింతగా అనిపిస్తుంటాయి.కార్లో వెళ్తోన్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకోలేదని.బండిలో సరిపడనంత పెట్రోల్ లేదని జరిమానా వేసిన ఘటనలు ఈమధ్య మనం చూశాం.తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగుచూసింది.కాలుష్య రహిత ఏథర్ 450X బైక్‌కు ఫైన్ వేశారు.
అది కూడా పొల్యూషన్ సర్టిఫికెట్ లేదని.ఆకుపచ్చ లైసెన్స్ ప్లేట్ కనిపిస్తూనే ఉంది.
పైగా ఆ బైక్ ఉద్గారాలను విడుదల చేయదని కూడా తెల్సు.ఆ మాత్రం నాలెడ్జ్ లేకుండా జరిమానా వడ్డించేశారు.
ఈ సంఘటన కేరళలోని మలప్పురంలోని నీలంచెరిలో సెప్టెంబర్ 6న ఈ ఘటన చోటుచేసుకుంది.మోటారు వాహనాల చట్టం , 1988 లోని సెక్షన్ 213(5)(E) కింద జరిమానా వేసినట్లు తెలిపారు.ఈ నిబంధన ఉల్లంఘించినందుకు బైక్ రైడర్‌కు రూ.250 ఫైన్ వేశారు.ప్రజంట్ ఆ ఫైన్ రిసిప్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.‘పోలీస్ బాబాయ్‌లకి టార్గెట్ ఉన్నట్లుంది.అందుకే కనిపించిన ప్రతి వాహనానికి ఫైన్ వేస్తున్నారు’.‘నడుచుకుంటూ వెళ్తున్నా కూడా ఫైన్లు వేసేలా ఉన్నారుగా ఈ పోలీసులు’ అని నెటిజన్స్ సెటైరికల్ కామెంట్స్ పెడుతున్నారు.








