ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు.ఎప్పుడు ఏదో ఒక వ్యాపకాలతో బిజీగా ఉండే వాళ్ళు ఉన్నపళంగా ఇంట్లో ఖాళీగా ఉండటం అంటే కాస్తా బోరింగ్ గా ఉంటుంది.
చదువుకునే వయసులో ఉంటే ఆటలతో కాలక్షేపం అయిపొయింది.అయితే కరోనా వేళ అలాంటి ఆటలు కూడా చాలా వరకు బంద్ అయిపోయాయి.
నగరాలలో ఉన్న వారు ఇంటికే పరిమితం అయిపోయారు.ఇలాంటి సమయంలో సెలబ్రిటీలు ఎక్కువగా సోషల్ మీడియాలో అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ కాలక్షేపం చేస్తున్నారు.
మరికొంత మంది ఇంటి పనులలో బిజీ అయిపోతున్నారు.అయితే సామాన్యుల పరిస్థితి వేరుగా ఉంటుంది.
అలాంటి వారికి టాలీవుడ్ స్టార్ నటుడు జగపతి బాబు కొన్ని సలహాలు ఇస్తున్నారు.
లాక్ డౌన్ టైంలో అభిమానులు ప్రజలు పాటించాల్సిన కొన్ని టిప్స్ ను ఇన్ సైట్ ఆఫ్ మై మైండ్ పేరుతో జగపతిబాబు షేర్ చేసుకున్నారు.
ఈ రోజు మనం ఆక్సిజన్ గురించి పట్టించుకోము ఎందుకంటే మనం ఉచితంగా తీసుకుంటున్నాము.ఆక్సిజన్ ను డబ్బుతో కొనవలసి వస్తే? అప్పుడు దాని ప్రాముఖ్యత అర్థం అవుతుంది అని జగపతి బాబు చెప్పారు. ప్రతి ఒక్కరి మనస్సుకు శిక్షణ ఇవ్వాలని అంతర్గత ప్రపంచాన్ని చూసేందుకు యోగా-ధ్యానాన్ని అభ్యసించాలని కోరారు.మీరు మీడియా నుండి బాహ్య ప్రపంచానికి సంబంధించి చాలా డేటాను పొందుతున్నారు కానీ ఇప్పుడు మీలోని అంతర్గత ప్రపంచాన్ని చూసే సమయం వచ్చింది.
ధ్యానాన్ని అభ్యసించండి మీ మనస్సులోకి ప్రవేశించడానికి ప్రయత్నించండి మీరు దానిని నియంత్రించడం నేర్చుకుంటారు అంటూ చాలా విలువైన సూచనలు చేశారు.జీవితం సంతృప్తి కరంగా ఉండాలంటే జగ్గుభాయ్ చెప్పిన సూచనలు పాటిస్తే సరిపోతుందని ఇప్పుడు ఆయన షేర్ చేసిన విషయాలపై నెటిజన్లు వాఖ్యలు చేస్తున్నారు.