రాబోయే ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలోనూ గెలవడమే లక్షణంగా పెట్టుకున్న అధికార పార్టీ వైసీపీ దానికి అనుగుణంగానే రాజకీయ వ్యూహాలు రచిస్తోంది.ముఖ్యంగా టిడిపి( TDP ) కీలక నేతలు పోటీ చేయబోయే నియోజకవర్గాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.
టిడిపి అధినేత చంద్రబాబు పోటీ చేయబోతున్న కుప్పం నియోజకవర్గంలోనూ ఆయనను ఓడించాలని టార్గెట్ పెట్టుకుంది.అలాగే లోకేష్ పోటీ చేయబోయే మంగళగిరి లోను బలమైన అభ్యర్థిని పోటీకి దింపేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఇక టిడిపికి కంచుకోటగా ఉన్న హిందూపురం నియోజకవర్గంలో వైసిపి జెండా ఎగురవేయాలనే పట్టుదలతో ఉంది.అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నందమూరి బాలకృష్ణను ఓడించేందుకు అనేక వ్యూహాలు రచిస్తోంది.2014 , 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచిన నందమూరి బాలకృష్ణ 2024 ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే పట్టణాలతో ఉండడంతో, ఈసారి బాలకృష్ణకు ఆ అవకాశం దక్కకుండా చేయాలని వైసిపి భావిస్తుంది.
![Telugu Ap, Hindupuram, Naveen Nishchal, Ys Jagan-Telugu Top Posts Telugu Ap, Hindupuram, Naveen Nishchal, Ys Jagan-Telugu Top Posts](https://telugustop.com/wp-content/uploads/2023/09/jagan-ap-politics-tdp-ycp-Hindupuram-2024-elections-Peddireddy-Ramachandra-Reddy.jpg)
2014లో బాలకృష్ణపై నవీన్ నిచ్చల్ ను పోటీకి దింపింది .అలాగే 2019లో ఇక్బాల్ ను పోటీకి దింపిన వైసిపి ఓటమి( Nandamuri Balakrishna )పాలైంది.2024 ఎన్నికల్లోనూ పోటీకి దింపాలని భావించి ఇన్చార్జిగా ఆయనను నియమించింది.అయితే ఆయన గెలుపు అంతంత మాత్రమే అన్నట్టుగా ఉంటుందనే అభిప్రాయంతో ఆయనను తప్పించి ఆస్థానంలో దీపిక అనే మహిళలకు హిందూపురం నియోజకవర్గ బాధ్యతలను అప్పగించింది.అయితే మహమ్మద్ ఇక్బాల్ , నవీన్ నిశ్చల్ రెండు వర్గాలుగా ఉండడంతో దీపిక గెలుపు అంతంత మాత్రమే అన్నట్టుగా ఉంటుందని, గ్రూపు రాజకీయాల కారణంగా ఆమె ఓటమి చెందే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో, ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న జగన్ సూచనతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Peddireddy Ramachandra Reddy ) ఈ నియోజకవర్గం పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.
![Telugu Ap, Hindupuram, Naveen Nishchal, Ys Jagan-Telugu Top Posts Telugu Ap, Hindupuram, Naveen Nishchal, Ys Jagan-Telugu Top Posts](https://telugustop.com/wp-content/uploads/2023/09/ys-jagan-ap-politics-tdp-ycp-Hindupuram.jpg)
ఇటు ఇక్బాల్ అటు నవీన్ నిశ్చల్ వర్గాలతో ఆయన సమావేశం అయ్యారు .భవిష్యత్తులో నవీన్ నిశ్చల్ కు కూడా నామినేటెడ్ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. రెండు వర్గాలు కలిసి పనిచేయాలని , దీపిక విజయం కోసం కృషి చేయాలని బాలకృష్ణను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని రామచంద్రారెడ్డి ఇరువర్గాలకు సూచించారు.ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీ జెండానే ఎగురుతుందని , సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ ఈ నియోజకవర్గంలో పర్యటించకపోవడంతో ఇక్కడ సమస్యలను పెద్దగా పట్టించుకోకపోవడం వంటి కారణాలతో టిడిపి క్యాడర్ కూడా అసంతృప్తితో ఉందని వైసిపి గుర్తించింది.
వీటినే అవకాశంగా మార్చుకుని వచ్చే ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది.