'కారు'తో ప్రయాణం ... కుదుపులు తప్పవా...?

ఏపీలో ఇప్పుడు నడుస్తున్న చర్చ అంతా వైసీపీకి తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ మద్దతు పలకడం గురించే.చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాకుండా చేసేందుకు జగన్ సర్వ శక్తులు ఒడ్డుతున్నాడు.ఈ క్రమంలోనే చంద్రబాబు కి బద్ద శత్రువుగా ఉన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో జగన్ ప్రస్తుతం స్నేహం చేస్తున్నాడు.అయితే… ఈ స్నేహం జగన్ కి ఎంతమేర కలిసివస్తుంది అనే లెక్కలు ఇప్పుడు బయలుదేరాయి.ప్రస్తుతం జగన్ ఉన్న పరిస్థితుల్లో అధికార పార్టీ టీడీపీని ఎదుర్కోవడం ఆషామాషీ కాదు.అందులోనూ ముక్కోణపు పోటీ తీవ్రంగా ఉండే అవకాశం కూడా ఎక్కువ ఉంది.ఈ నేపథ్యంలో… జగన్ ఖచ్చితంగా గెలవాలంటే వైసీపీ మరింత బలపడడంతో పాటు… తమ ప్రధాన ప్రత్యర్థి అయిన టీడీపీ మరింత బలహీనపడాలి.అందుకే… జగన్ ముందు వెనుక ఆలోచించకుండా టీఆర్ఎస్ తో స్నేహం చేస్తున్నాడు.

 It Is Difficult To Join With Trs Party In Ap-TeluguStop.com

అయితే టీఆర్ఎస్ కి ఏపీలో ఎంత పలుకుబడి ఉంది అనే విషయం పక్కనపెడితే… ఆ పార్టీతో వైసీపీ కలిసి ముందుకు వెళితే మరిన్ని ఇబ్బందులు తప్పవు అనే వాదన కూడా ఇప్పడు బయలుదేరాయి.గతంలో ఏపీ పేరు చెప్తే కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవాడు.ఆంధ్రా వాళ్ళు దొంగలు అంటూనే… ఆంధ్రులు రాక్షసులు ఆంధ్రా పురోహితులకు ఆడంబరం ఎక్కువ, ఆంధ్రులది పేడ బిర్యానీ’ అంటూ అనేక అనుచిత వ్యాఖ్యలు చేసాడు.ఈ మాటలను ఏపీ ప్రజలు ఇంకా మర్చిపోలేదు.

ఇది కనుక ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీలు హైలెట్ చేసి ప్రచారం చేస్తే వైసీపీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.ఇప్పటిదాకా ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న ఆరోపణలను నిజం చేస్తూ… టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, వైసీపీ అధ్యక్షుడు జగన్‌ మధ్య జరిగిన భేటీ వైసీపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అయితే ఈ విషయాలు ఏవీ ఇప్పట్లో పట్టించుకునే స్టేజ్ లో జగన్ లేడు.ఎందుకంటే…శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సూత్రాన్ని జగన్ పాటించే ఉద్దేశం లో ఉన్నాడు.అయితే టీఆర్‌ఎస్‌ విషయంలో మాత్రం ఈ సూత్రం వర్తించదని కేసీఆర్‌తో దోస్తీని సీమాంధ్ర ప్రజలు ఒప్పుకోరని కొంతమంది లెక్కలు వేస్తున్నాడు.ప్రత్యేక హోదాపై వ్యతిరేకత, పోలవరంపై కేసుల దాఖలు, విద్యుత్తు వినియోగానికి సంబంధించి రూ.5200 కోట్ల ఎగవేత, ఉమ్మడి సంస్థల ఆస్తుల పంపిణీకి సహాయ నిరాకరణ… ఇలాంటి అనేక అంశాల నేపథ్యంలో టీఆర్‌ఎ్‌సతో చేతులు కలపడం వైసీపీకి నష్టం చేకూర్చే అంశాలే అని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.తాము కేంద్రంలో అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని తెలంగాణ గడ్డపైనే సోనియా, రాహుల్‌ చేసిన ప్రకటనపై కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌ తదితర టీఆర్‌ఎస్‌ నేతలు వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

ఇలాంటి విషయాలన్నీ రేపు ఎన్నికల ప్రచారంలో టీడీపీ లేవనెత్తితే మరిన్ని ఇబ్బందులు తప్పవని వైసీపీకి అప్పుడే సూచనలు మొదలయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube