చంద్రబాబు నాయుడుకు ఇంటిపోరు పెరిగిపోతోంది.విజయవాడ పార్టీ నేతల మధ్య పెరిగిపోతున్న ఆధిపత్య పోరుతో తల బొప్పికడుతోంది.
మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో నేతలంతా ఐక్యంగా ఉండి అధికార వైసీపీని ఎదుర్కోవాల్సిందిపోయి తమలో తాము గొడవలు పడుతు రోడ్డున మీద పడిపోతున్నారు.వీళ్ళ మధ్య పెరిగిపోతున్న గొడవల్లో చివరకు చంద్రబాబును కూడా వీధిలోకి ఈడ్చేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది.
చాలా కాలంగా విజయవాడ ఎంపి కేశినేని నానికి మాజీమంత్రి దేవినేని ఉమకు ఉప్పు-నిప్పుగా ఉంది పరిస్దితులు.మొన్నటి ఎన్నికల్లో తన ఓటమికి పార్టీలోని కొందరు సీనియర్లు బాగా ప్రయత్నించారని ఎంపి బహిరంగంగానే ఆరోపణలు చేశారు.
దానికితోడు దేవినేని అండ్ కో ఓడిపోయి ఎంపి గెలవటంతో వీళ్ళ మధ్య గొడవలు అంతకంతకు పెరిగిపోయాయి.చివరకు గొడవలు ఏ స్ధాయికి చేరుకున్నాయంటే ఎంపి వర్సెస్ మాజీ ఎంఎల్ఏ బోండా ఉమ, ఎంఎల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎంఎల్ఏ నాగూల్ మీరా లాంటి వాళ్ళు బహిరంగంగానే గొడవలు పడుతున్నారు.

తాజాగా బోండా, బుద్ధా మీడియాతో మాట్లాడుతూ ఎంపి రాజీనామాకు డిమాండ్ చేయటమే విచిత్రంగా ఉంది.సొంతపార్టీ నేతలే తన రాజీనామాకు పట్టుబడతారని ఎంపి ఊహించుండరు.అంటే అంతదాకా వీళ్ళ మధ్య ఆధిపత్య పోరు పెరిగిపోయింది.ఒకవేళ వీళ్ళ డిమాండ్ తో ప్రిస్టేజి ఫీలైన నాని రాజీనామా చేస్తే ఆ సమస్యంతా చంద్రబాబుకు చుట్టుకుంటుందనే స్పృహ కూడా నేతల్లో లేకపోయింది.
పోరబాటున నాని రాజీనామా చేసి ఉపఎన్నిక జరిగితే టీడీపీ పని గోవిందా.
పంచాయితి ఎన్నికలతోనే చంద్రబాబు తల బొప్పికట్టేసింది.
మున్సిపాలిటి ఎన్నికల ఫలితాల్లో మెరుగైన స్ధితిలో ఉంటుందనే ధైర్యం ఎవరికీ లేదు.ఇలాంటి స్ధితిలో పొరబాటున ఎంపి స్ధానానికి జరిగిన ఉపఎన్నికల్లో టీడీపీ గనుక ఓడిపోతే అంతే సంగతులు.
ఎందుకంటే టీడీపీ ఓటమికే ఎక్కువ అవకాశాలున్నాయి.మరి ఈ విషయాలు తెలిసే నేతలు నాని రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.రాజీనామా విషయంలో ఇపుడు స్పందించాల్సిన అవసరం నానికన్నా చంద్రబాబుకే ఎక్కువుంది.మరి చూద్దాం చంద్రబాబు ఏమి చేస్తారో.?
.