పీఎం భూమి పూజకు హాజరు రాజ్యాంగ విరుద్ధం : అసదుద్దీన్

ప్రధానమంత్రి కార్యాలయం గత సోమవారం ప్రధాని నరేంద్రమోదీ ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో జరగబోయే రామమందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి హాజరు కానున్నారని ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే.అయితే తాజాగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఈ విషయంపై స్పందించారు.

 Asaduddin, Pm Modi, Bhoomi Puja, Rama Mandiram, Hyderabad-TeluguStop.com

అధికార పదవిలో ఉంటూ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు.ఒకే మతానికి ప్రాధాన్యత ఇవ్వడం సరికాదన్నారు.

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.భూమి పూజకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ షెడ్యూల్ ను ప్రధాని కార్యాలయం విడుదల చేయడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు.అయోధ్య భూమిపూజ కార్యక్రమానికి అధికార హోదాలో ఉన్న ప్రధాని హాజరుకావడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.పదవి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చేసిన రాజ్యాంగ ప్రమాణాన్ని ఉల్లంఘించారని ఎంసీ అసదుద్దీన్ ఓవైసీ ట్వీటర్ లో పేర్కొన్నాడు.

భారత రాజ్యాంగంలో లౌకికవాదం పునాది లాంటిదని,400 ఏళ్లుగా అయోధ్యలో ఉన్న బాబ్రీ మసీదును ఓ నేరస్థుల సమూహం 1992లో కూల్చివేసింది.ఈ విషాదకర సంఘటన ఎప్పటికి మర్చిపోలేనిదని ఎంపీ అసదుద్దీన్ పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.అయోధ్యలో రామ మందిరం నిర్మాణ కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయి.

ఇప్పటికే ప్రముఖులను ఆహ్వానించింది ఆలయ ట్రస్ట్.ఆగస్టు 5న తెల్లవారుజామున భూమి పూజ కార్యక్రమం జరుగనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube