ఉత్తరప్రదేశ్( Uttar Pradesh ) రాష్ట్రంలోని అమేథీ రైతు ఆరిఫ్ ఖాన్ గుర్జార్ గాయపడిన కొంగను కాపాడడంతో ఆ కొంగ అతనితోనే బంధం పెనవేసుకొని ఉండిపోవడంతో వారి మధ్య స్నేహం ఏర్పడింది.ఆమధ్యకాలంలో దానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొట్టిన సంగతి అందరికీ తెలిసినదే.
ఇక అటవీ అధికారులు వన్యప్రాణి సంరక్షణ పేరుతో అతని నుంచి కొంగను వేరుచేసి సంరక్షణ కేంద్రానికి తరలించిన ఘటనాన్ని చూసి యావత్ నెటిజన్ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది.ఇక ఉదంతం మరువుక ముందే అచ్చం అలాంటి కొంగ స్నేహమే యూపీలో మరొకటి చోటుచేసుకోవడం విశేషం.
అయితే ఈ వ్యక్తికి కొంగతో స్నేహం చాలా యాదృచ్ఛికంగా జరగడం గమనార్హం.విషయం ఏమంటే, యూపీలోని మౌకీకి చెందిన రామ్‌సముజ్ యాదవ్ అనే వ్యక్తికి తన పొలంలో ఓ కొంగ( Crane ) కనిపించగా దానికి అనుకోకుండా ఒకరోజు ఆహారం పెట్టాడు.అలా ఓ రెండు మూడు సార్లు చేసాక ఆ కొంగ అతని వద్దకు పదేపదే రావడం జరిగింది.దీంతో ఆయన ఆ కొంగను మిగతా కొంగల గుంపులో వదిలేసినా, వేరు చేసేందుకు యత్నించినా అది మాత్రం ఆయన్ని విడిచిపెట్టలేదు.
ఇలా ఏడాదిగా ఆ వక్తితో ఈ కొంగ స్నేహం చేయడం గమనార్హం.
రాజ్‌సముజ్ పిలుపు వినగానే వచ్చే ఈ కొంగ.ఆయన ఎక్కడకు వెళ్తుంటే అది అక్కడకు వెళ్తోంది అంటూ స్థానికులు కూడా చెబుతున్నారు.ఇకపోతే యూపీ రాష్ట్ర పక్షి అయినటువంటి ఈ కొంగను 1972 వన్యప్రాణి చట్టం కింద( Wildlife Protection Act ) పెంచుకోవడం నేరం.
పైగా ఇవి రెడ్‌లిస్ట్ పెట్ బర్డ్స్ జాబితాలో ఉండటంతో ఇవి పెంచడం చట్ట విరుద్ధం కూడా.ఆ కారణం చేతనే అటవీ అధికారులు ఇలా వాటిని పెంచేవారిపైన చర్యలు తీసుకుంటున్నారు.
ఆ కారణంతోనే నెటిజన్లు ఈ విషయం అటవీ అధికారుల దృష్టికి చేరితే ఏం జరుగుతుందో చూడాలి? అంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్లు పెడుతున్నారు.