మెహ్రీన్ ఫిర్జాదా( Mehreen Pirzada ).చిన్నప్పటి నుండే హీరోయిన్ అవ్వాలని ఎన్నో కలలు కని మోడలింగ్ చేసింది.
మిస్ రాజస్థాన్ గా ఎన్నికై ఆర్టిస్ట్ కో ఆర్డినేటర్ ద్వారా సినిమాల్లో ఛాన్స్ ల కోసం ఎన్నో రకాల ఇబ్బందులు పడింది నటి మెహరీన్ పిర్జాదా.

ఇక మొట్ట మొదటిసారి ఈమె హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన నాని హీరోగా చేసిన కృష్ణ గాడి వీర ప్రేమ గాథ ( Krishna Gaadi Veera Prema Gaadha ) సినిమాలో హీరోయిన్ గా చేసింది.ఇక ఈ సినిమా హిట్ అవ్వడంతో ఆ తర్వాత మహానుభావుడు సినిమాలో మెహ్రీన్ కి అవకాశం వచ్చింది.ఈ సినిమా కూడా హిట్టే.
ఆ తర్వాత రాజా ది గ్రేట్ సినిమా కి కూడా హిట్ అయింది.కానీ ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు ప్లాఫ్ అవ్వడంతో నటి మెహ్రీన్ కెరియర్ టాలీవుడ్ లో అయిపోయింది అని అందరూ మాట్లాడుకున్నారు.

కానీ ఎప్పుడైతే ఎఫ్2 ( F2 ) సినిమాలో నటించిందో అప్పటినుండి మళ్ళీ సినిమాల్లో బిజీ అయింది.ఈ విషయం పక్కన పెడితే మెహ్రీన్ పంజాబ్ మాజీ సీఎం మనవడు భవ్య భీష్ణోయ్( Bhavya Bishnoi ) తో ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లిదాకా వచ్చాక విడిపోయారు.ఇక వీరి ఎంగేజ్మెంట్ బ్రేక్ అయినప్పుడు చాలానే కారణాలు తెర మీద వినిపించాయి.ఇక అందులో ఒకటే యంగ్ డైరెక్టర్ తో మెహ్రీన్ ఎఫైర్ నడపడం.

మెహ్రీన్ అప్పట్లో రాజా ది గ్రేట్ ( Raja the great ) సినిమా చేసే సమయంలో అనిల్ రావిపూడి తో సన్నిహితంగా ఉంటూ ఆయన చేసిన సినిమాల్లో హీరోయిన్ గా తీసుకోవడం,అలాగే కొన్ని సినిమాలకు మెహ్రీన్ ని రికమెండ్ చేయడంతో వీరి మధ్య ఉండే సాన్నిహిత్యం బయట పడి టాలీవుడ్ లో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోంది అని టాక్ వినిపించింది.కానీ వీటిని పట్టించుకోని మెహ్రీన్ అనిల్ ఇద్దరు సినిమాల్లో బిజీ అయిపోయారు.ఇక ఇదంతా పక్కన పెడితే 2021లో మెహ్రీన్ పంజాబ్ కి చెందిన భవ్య భీష్ణోయ్ అనే రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకుంది.
ఇక కరోనా సమయం కావడంతో వీరి పెళ్లి పోస్ట్ పోన్ అయింది.
ఇక అదే సమయంలో భవ్య భీష్ణోయ్ ( Bhavya Bishnoi ) మెహ్రీన్ మధ్య కొన్ని మనస్పర్దలు వచ్చాయి.ఇక వాటికి ప్రధాన కారణం మెహ్రీన్ మళ్లీ సినిమాల్లో నటించడమే.
ఎందుకంటే మెహ్రీన్ పెళ్లి తర్వాత సినిమాల్లో నటించనని మాటిచ్చిందట.కానీ పెళ్లికి మరికొన్ని రోజులు సమయం ఉండడంతో మెహ్రీన్ కి కోలీవుడ్ హీరో ధనుష్( Hero Dhanush ) మారా సినిమాలో అవకాశం వచ్చిందట.
ఇక ఈ విషయం భవ్య భిష్ణోయ్ కి చెప్పకుండా మెహ్రిన్ సీక్రెట్ గా చెన్నైకి వచ్చి ఫోటోషూట్ చేసిందట.ఇక ఈ విషయం తెలిసి భవ్య భిష్ణోయ్ మెహ్రీన్ తో గొడవ పెట్టుకున్నారట.

ఆ తర్వాత ఇద్దరు విడిపోవాలి అనుకున్నప్పటికీ ఇంట్లో పెద్దవాళ్లు ఒప్పించడంతో మళ్ళీ కలిసిపోయారు.కానీ అదే సమయంలో ప్రతిసారి ఆమె గతంలో నడిపించిన ఎఫైర్ ల గురించి మాట్లాడడంతో మెహ్రీన్ కి కోపం వచ్చేది.అంతేకాకుండా ప్రతి విషయంలో మెహ్రీన్ ని అనుమానించేసరికి తనకి సెట్ అవ్వదు అని అనిపించడంతో అతనితో ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకుందట.ఇలా వీరి ఎంగేజ్మెంట్ రద్దు అయిన సమయంలో అనిల్ రావిపూడి ( Anil Ravipudi ) పేరు ఎక్కువగా వినిపించింది.