అనసూయ ( Anasuya ) భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు.ఒకప్పుడు న్యూస్ రీడర్గా అలాగే యాంకర్ గా కొనసాగుతున్నటువంటి ఈమె ప్రస్తుతం వెండితెరపై నటిగా సందడి చేస్తున్నారు.
యాంకర్ గా జబర్దస్త్ కార్యక్రమానికి పనిచేస్తూ ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ అనంతరం సినిమా అవకాశాలను అందుకున్నారు.ఈమెకు రంగస్థలం ( Rangasthalam )సినిమాలోని రంగమ్మత్త పాత్రలో నటించి ఎంతో మంచి గుర్తింపు పొందారు.
ఈ సినిమా తర్వాత అనసూయ కెరియర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు.
ఈ విధంగా ఈమెకు ఇండస్ట్రీలో వరుసగా సినిమా అవకాశాలు రావడంతో ఏకంగా బుల్లితెర కార్యక్రమాలకు గుడ్ బై చెబుతూ వెండితెరపై సందడి చేస్తూ ఉన్నారు.ఇలా వరుస సినిమాలతో కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే అనసూయ సినిమాల షూటింగ్ సమయంలో తనకు ఏ మాత్రం విరామం దొరికిన ఆ సమయాన్ని తన కుటుంబ సభ్యులతో గడపడానికి ఇష్టపడతారు.ఇలా ఒకవైపు వృత్తిపరమైన జీవితాన్ని మరోవైపు వ్యక్తిగత జీవితాన్ని కూడా చాలా బ్యాలెన్స్ చేస్తూ తన జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పాలి.
ఇక ఈమె సోషల్ మీడియాలో( Social media ) కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యామిలీతో ఉండే ఆనందమైన క్షణాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు.ఇక తాజాగా తన భర్త శశాంక్ భరద్వాజ్ ( Shashank Bhardwaj ) పుట్టినరోజు ( Birthday ) కావడంతో తన భర్త పిల్లలతో అనసూయ ఓ రెస్టారెంట్ కి వెళ్లి తన భర్త పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నట్లు తెలుస్తోంది.ఇందుకు సంబంధించిన ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన భర్త గురించి ఎంతో గొప్పగా చెబుతూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా అనసూయ తన ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ ప్రపంచానికి నీలాంటి కొడుకు ఎంతో అవసరం, ఒక అన్నయ్యలా ఒక భర్తల ఒక మంచి తండ్రిలా, ఒక అల్లుడిగా ఈ ప్రపంచానికి నీలాంటి వ్యక్తి చాలా అవసరం అంటూ తన భర్త గురించి గొప్పగా పొగుడుతూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.తన భర్త పుట్టినరోజు సందర్భంగా అనసూయ ఆయనపై తనకు ఉన్నటువంటి ప్రేమ మొత్తాన్ని చూపిస్తూ ఇలా శుభాకాంక్షలు తెలియజేస్తూ చేస్తున్నటువంటి పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక అనసూయ శశాంక్ ఇద్దరు కూడా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
అయితే వీరిద్దరూ స్కూల్ సమయంలోనే ప్రేమలో పడ్డారని దాదాపు 8 సంవత్సరాల పాటు ప్రేమ కోసం పోరాడి పెద్దలను ఒప్పించి అనసూయ శశాంక్ ని ( Shashank Bhardwaj పెళ్లి చేసుకున్నారు.గత కొద్దిరోజుల క్రితం ఈమె తన ప్రేమ గురించి మాట్లాడుతూ 8 సంవత్సరాల పాటు తనతో సహజీవనం చేశానని ఇలా మా పెళ్ళికి పెద్దలతో పోట్లాడి మరి నా ప్రేమను గెలిపించుకున్నాను అంటూ ఓ సందర్భంలో ఈమె ప్రేమ విషయాలను బయటపెట్టిన సంగతి తెలిసిందే.
ఇక అనసూయ గురించి సోషల్ మీడియాలో>( Social media )న్నో రకాల వార్తలు ఎన్నో ట్రోల్స్ వచ్చినా కూడా శశాంక్ అనసూయ మధ్య ఏమాత్రం ప్రేమ తగ్గలేదని వీరిద్దరి మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు కూడా లేకుండా ఎంతో సంతోషంగా ఉన్నారు.