కోడి కత్తి కేసులో శివాజీ కూడా ఇరుక్కున్నట్టేనా ..?

తెలుగురాష్ట్రాల్లోనే కాకుండా… దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోడి కత్తి తో జగన్ మీద జరిగిన దాడి వ్యవహారం పెద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ… చివరాఖరికి కోర్టు మెట్లు ఎక్కడం… అక్కడి నుంచి ఎన్ ఐ ఎ దర్యాప్తు కు కోర్టు ఆదేశించడం….

 Hero Shivaji In To The Case Of Ys Jagan Attack-TeluguStop.com

ప్రస్తుతం ఆ దర్యాప్తు మరింత ముమ్మరం అవ్వడం… చక చకా జరిగిపోయాయి.ఈ కేసు అనేక రాజకీయ ప్రకంపనలకు దారి తీసే అవకాశం ఉండడంతో… మరింత జాగ్రత్తగా ఈ కేసును ఎన్ ఐ ఎ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

దీనిలో భాగంగానే….నిందితుడు శ్రీనివాసరావును విశాఖ తీసుకెళ్లి దాడి ఎలా చేశాడో అతడి చేత సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేశారు.

పలు కోణాల్లో శ్రీనివాస్‌ను ప్రశ్నిస్తున్నారు.

అసలు ఈ దాడి జరిగిన తరువాత ఆపరేషన్ గరుడ పేరుతో… సినీ హీరో శివాజీ అతిగా స్పందించడం… ఇదంతా ఆపరేషన్ గరుడలో భాగంగా జరుగుతోందని సంచలన ప్రకటన చేయడం ….ఇవన్నీ పెద్ద సంచలనం సృష్టించడంతో… ఈ కేసులో శివాజీని కూడా విచారించే అవకాశం ఉంది.శ్రీనివాసరావు ఒక పాత్రధారి మాత్రమే.

ఈ పాత్రధారి వెనుక ఉన్న దర్శక నిర్మాతలు ఎవరో తెలియాల్సి ఉంది.శ్రీనివాస్ చేసిన దాడికి, ఆపరేషన్ గరుడకు లింక్ ఉంది.

దాడి జరిగిన తర్వాత చూపించిన ఫ్లెక్సీ లోనూ గరుడ బొమ్మ ఉంది కాబట్టి.ఇప్పుడు ముఖ్యంగా నటుడు శివాజీని ఎన్‌ఐఏ ప్రశ్నించవచ్చు.

ఎయిర్‌ పోర్టులోని సీసీ కెమెరాలు సరిగ్గా జగన్‌ పాదయాత్ర విశాఖ జిల్లాలో ప్రారంభం అయిన రోజు నుంచే ఆగిపోవడం కీలక పరిణామం.సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వెనుక ఏ ఎయిర్‌పోర్టు అధికారుల హస్తముందన్నది నిర్ధారణ కావాల్సి ఉంది.

అందుకే దర్యాప్తుకు అవసరమైన ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఎన్ ఐ ఎ అధికారులు.

హీరో శివాజీ ఆపరేషన్ గరుడలో భాగంగా ప్రతిపక్ష నేతపై దాడి జరుగుతుంది.ఆతర్వాత రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందని మీడియా లో అదేపనిగా శివాజీ చెప్పడం అనేక అనుమానాలకు తావిచ్చింది.కాబట్టి అలా దాడి చేసి అల్లకల్లోలం సృష్టించేందుకు ప్రయత్నించిన వారు ఎవరన్నది శివాజీ దగ్గర తప్పకుండా సమాచారం ఉంటుంది.

ప్రధాన నిందితుడు శ్రీనివాసరావు, నటుడు శివాజీతో పాటు ఎయిర్‌పోర్టు రెస్టారెంట్ ఓనర్ హర్షవర్థన్ చౌదరి, ఆపరేషన్‌కు సహకరించారని ఆరోపణలు ఎదుర్కొన్న ఎయిర్‌పోర్టు అధికారి వేణుగోపాల్‌ను ఎన్‌ఐఏ విచారించే అవకాశం కనిపిస్తోంది.ఈ లెక్కన చూస్తే ఈ కేసు దర్యాప్తు మరిన్ని ప్రకంపనలు సృష్టించే అవకాశం కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube