మన శరీరంలోని ఈ ఒక్క పాయింట్ పై మర్దన చేస్తే 100 రోగాలను నయం చేసుకోవచ్చు..

ఆక్యుప్రెషన్ వైద్యం గురించి తెలుసు కదా.అదేనండి మన శరీరంలో కొన్ని ప్రదేశాల్లో సున్నితంగా మర్దనా చేయడం వలన అనారోగ్యాలను దూరం చేసుకోవడం.

 Healthy Solutions The Point Of A Hundred Diseases-TeluguStop.com

ఇటీవల కాలంలో మందుల కంటే ఈ విధమైన ప్రత్యేక పద్దతుల ద్వారానే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు.అయితే ఆయా ర‌కాల అనారోగ్యాల‌ను న‌యం చేసుకోవాలంటే శ‌రీరంలోని ప‌లు విభిన్న‌మైన ప్ర‌దేశాల‌పై మ‌సాజ్ చేయాల‌ని తెలుసు కానీ, మ‌న దేహంలో ఉన్న కేవ‌లం ఒకే ఒక్క భాగంలో మ‌సాజ్ చేస్తే దాదాపు 100 ర‌కాల వ్యాధులను న‌యం చేసుకోవ‌చ్చ‌ని మీకు తెలుసా.? ఆ ఒకే ఒక్క భాగం ఏంటో, దాని వ‌ల్ల మ‌న‌కు ఏమేం ఉప‌యోగాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

కుడి, ఎడ‌మ మోకాళ్ల‌కు కిందుగా ఓ ప‌క్క‌న స‌దరు వ‌న్ అండ్ ఓన్లీ పాయింట్ ఉంటుంది.మోకాలిపై చేతిని ఉంచి కొద్దిగా ప‌క్క‌కు వెళ్లి కింద వెతికితే ఈ పాయింట్ దొరుకుతుంది.దీన్నే పాయింట్ ఆఫ్ హండ్రెడ్ డిసీజెస్ (point of a hundred diseases) అని కూడా పిలుస్తారు.

ఈ పాయింట్ వ‌ద్ద శ‌రీరంలోని 12 ప్ర‌ధాన నాడులను క‌లిపే 365 నాడులు క‌లుస్తాయ‌ట‌.ఈ క్ర‌మంలో ఈ పాయింట్‌పై నిత్యం ఉద‌యం, మ‌ధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వేళ్ల‌లో వీలును బ‌ట్టి 10 నిమిషాల పాటు మ‌సాజ్ చేయాలి.

దీంతో అనేక అనారోగ్యాల‌ను న‌యం చేసుకోవ‌చ్చు.

పాయింట్ ఆఫ్ హండ్రెడ్ డిసీజెస్ ను నిత్యం మ‌ర్ద‌నా చేయ‌డం వ‌ల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి.ఇన్సులిన్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది.మ‌ధుమేహం ఉన్న వారికి ఇది ఎంత‌గానో మేలు చేస్తుంది.

నొప్పులు, వాపులు త‌గ్గిపోతాయి.

శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌మ‌వుతుంది.రోగనిరోధక వ్యవస్థ పటిష్టమైతే మన శరీరానికి వచ్చే ముప్పే ఉండదు.అంతేకా జీర్ణ‌క్రియ మెరుగుప‌డి జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి.

హార్ట్ ఎటాక్ వ‌ల్ల శ‌రీరానికి క‌లిగిన న‌ష్టం నివారించ‌బ‌డుతుంది.అధిక బ‌రువుతో బాధపడేవారు బరువు త‌గ్గుతారు కూడా.

అంతేకాదు, ఇంకా ఎన్నో ర‌కాలుగా మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు