పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పోటీ చేస్తుండడంతో, ఆయనను ఓటింగ్చేందుకు వైసిపి గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది.వైసిపి అభ్యర్థిగా మాజీ మంత్రి, ఎంపీ వగా గీతను పోటీకి దించారు.
పవన్ కు మద్దతుగా సినిమా రంగానికి చెందిన అనేకమంది నటులు పిఠాపురం వచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.ఇక పవన్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ నుంచి గెలవనివ్వమని, పిఠాపురం ప్రజలు ఆయనను ఓడిస్తారని, ఆయన ఓటమి చెందకపోతే తన పేరును పద్మనాభ రెడ్డి ( Padmanabha Reddy )గా మార్చుకుంటాను అంటూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) సవాల్ చేశారు.
అయితే ముద్రగడ పద్మనాభం సవాల్ పై ఆయన కుమార్తె ముద్రగడ క్రాంతి భారతి తీవ్రంగా స్పందించారు.

ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఆమె ముద్రగడ పద్మనాభం పై విమర్శలు చేశారు.తన తండ్రి ముద్రగడ తీరు గురించి స్పందిస్తూ ” పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసిపి నేతలు వ్యర్థ ప్రయత్నాలు చేస్తున్నారు.వైసిపి అభ్యర్థి వంగ గీత కోసం తన తండ్రి పనిచేయవచ్చు.కష్టపడొచ్చు తప్పులేదు.జగన్ మెప్పుకోసం పవన్ కళ్యాణ్ మీద మాట్లాడుతున్న భాష మాత్రం సరికాదు.

పవన్ కళ్యాణ్, ఆయన అభిమానులను కించపరిచేలా మాట్లాడడం తగదు.ముద్రగడ తీరు మార్చుకోవాలి.పవన్ కళ్యాణ్ ను తిట్టడం వల్ల ఒరిగేదేమీ లేదు.ఎన్నికల సమయంలో ముద్రగడను సీఎం జగన్ ( CM Jagan )వాడుతున్నారు .ఆ తరువాత ముద్రగడ ఎటూ కాకుండా పోవడం ఖాయం.ఈ విషయం ముద్రగడ తెలుసుకుంటే మంచిది.
పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తనవంతుగా కృషి చేస్తా ” అంటూ క్రాంతి భారతి సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం క్రాంతి భారతి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం రేకెత్తిస్తున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా పిఠాపురం లో జరిగే ఎన్నికలపైనే జనాల్లో ఆసక్తి నెలకొంది.







