కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ( Amit Shah )వీడియో మార్ఫింగ్ కేసులో ఢిల్లీ పోలీసుల( Delhi Police ) దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.ఈ మేరకు ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ లోనే మకాం వేశారు.
నిన్నటి నుంచి ఢిల్లీ పోలీసుల బృందం హైదరాబాద్ లోనే ఉందని తెలుస్తోంది.తాజాగా ఇవాళ మరో ఢిల్లీ ఐపీఎస్ అధికారి హైదరాబాద్ కు రానున్నారు.
కాగా ఈ కేసులో ఇప్పటికే ఐదుగురిని సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే అరెస్ట్ అయిన ఐదుగురిని విచారించిన సైబర్ క్రైమ్ పోలీసులు ఫేక్ వీడియోకు సంబంధించిన కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్ లను సీజ్ చేశారు.







