ప్రపంచంలో టెక్నాలజీ ( Technology )యుగంలో రోజురోజుకీ దూసుకుపోతోంది.మరోవైపు కొందరు మూఢనమ్మకాలను అనుసరించి ఎక్కడున్నారో అలాగే ఉండిపోతున్నారు.
ఇలా మూఢనమ్మకాలను కేవలం చదువుకొని వారే అనుకుంటే పొరపాటే చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఇలా మూఢనమ్మకాలను విశ్వసించి వారి జీవితాలను కొన్నిసార్లు సర్వనాశనం చేసుకుంటున్నారు.ఇలాంటి ఘటనలకు సంబంధించి ఎన్నో రకాల వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికే చూసి ఉంటాము.
తాజాగా మరో వీడియో ఈ లిస్టులో చేరింది.పాముకాటు కారణంగా చనిపోగా.
, మృతదేహాన్ని గ్రామస్తులు రెండు రోజులపాటు నీటిలో వేలాడదీసిన సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.ఇక ఈ ఘటన సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్( Buland city in Uttar Pradesh ) జిల్లా జైరామ్ పూర్ కుదేన్య గ్రామంలో చోటుచేసుకుంది.గ్రామంలోని 20 ఏళ్ల మోహిత్ కుమార్ ( Mohit Kumar )తన పొలంలో పనిచేస్తుండగా ఓ విష సర్పం ఉన్నట్టుండి అతని కాటువేయగా., వెంటనే అది గమనించిన అతడు చికిత్స నిమిత్తం వైద్యుడు వద్దకు వెళ్లాడు.అయితే ద్రువదృష్టశాతం అతడు చికిత్స తీసుకున్నప్పటికీ కోలుకోలేక అతని పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు.
సరిగ్గా ఇదే సమయంలో యువకుడు తల్లితండ్రులు ఎవరో చెప్పిన మాటలు విని నీటిలో కట్టివేలాడదీస్తే మళ్లీ బతికే అవకాశం ఉందని చెప్పడంతో గ్రామస్తులు సహకారంతో అతడి మృతదేహాన్ని సమీపంలోనే గంగా నదిలో తాడుతో కట్టి వేలాడదీశారు.

ఇలా వేలాడదీయడం వల్ల ఒంట్లోని విషయం మొత్తం నీటిలోకి వెళ్ళిపోతుందన్న వారి మూఢనమ్మకం కారణంగా ఇలా చేశారు.అయితే ఇలా రెండు రోజులు పాటు చేసిన గాని అతడి శరీరంలో ఎలాంటి చలనము లేకపోవడంతో చివరకు మృతదేహాన్ని గ్రామ శివారులోని ఘాట్ పై దహనం చేశారు.ఇదివరకు హరిద్వార్ ప్రాంతంలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.







