ఓటుకు నోటు కేసు: నేడు సుప్రీం కోర్టులో విచారణ 

అప్పట్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది.ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ ,తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు( Parliament Elections ) జరుగుతున్న సమయంలోనే ఈ కేసు తెరపైకి రావడం, రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

 The Case Of Note For Vote Will Be Heard In The Supreme Court Today, Otuki Notu C-TeluguStop.com

ఓటుకు నోటు కేసులో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy ) తో పాటు, టిడిపి అధినేత చంద్రబాబు ఉన్నారు.ప్రస్తుతం రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండడంతో, ఈ కేసును వేరే ప్రాంతానికి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది.

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి( Former Minister Jagdish Reddy ) ఈ పెటిషన్ ను దాఖలు చేశారు.ఈ పిటిషన్ ను జస్టిస్ బి.ఆర్ గవాయి, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా, జస్టిస్ సందీప్ మొహతా ధర్మాసనం విచారణ చేయనుంది.

Telugu Aicc, Ap Cm Jagan, Ap, Chandrababu, Jagan, Otuki Notu, Pcc, Stefenson, Te

2017లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఎరచూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు టిడిపి అధినేత చంద్రబాబు ( Chandrababu )ప్రయత్నించారని అప్పుడు టిడిపి కీలక నేతగా ఉన్న రేవంత్ రెడ్డి దీనికోసం మధ్యవర్తిగా వ్యవహరించారని టిడిపి అభ్యర్థికి ఓటు వేయాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్( MLA Stephen Son ) కి డబ్బులు ఇస్తూ రేవంత్ రెడ్డి తెలంగాణ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టు పడడం, అప్పట్లో ఆయన అరెస్టు కావడం రాజకీయంగా సంచలనం రేపింది.చంద్రబాబు ఈ ప్రలోభ పరవానికి తెరతీసారని తెలంగాణ ఏసీబీ కొన్ని ఆధారాలను బయటపెట్టింది.

Telugu Aicc, Ap Cm Jagan, Ap, Chandrababu, Jagan, Otuki Notu, Pcc, Stefenson, Te

చంద్రబాబు ఫోన్ లో స్టీఫెన్ సన్ తో మాట్లాడుతూ, మనోళ్లు బ్రీఫ్డ్ మీ అంటూ మాట్లాడిన మాటలు, ఆయన గొంతేనని ఫోరెన్సిక్ సైతం నిర్ధారించింది.ఈ కేసులో చంద్రబాబు నాయుడును నిందితుడిగా చేర్చాలంటూ ప్రస్తుత వైసిపి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ పైన ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది.ఈ నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టు లో దీనిపై ఏ విధంగా విచారణ జరగనుంది అనేది ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube