పవర్‌లిఫ్టింగ్ ( Powerlifting )అనేది సాధారణంగా బార్‌బెల్స్ వంటి బరువులను ఎత్తే క్రీడ.కానీ పాకిస్థాన్‌లోని ( Pakistan )గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా పంజాబ్, పోటోహార్ ప్రాంతంలో, అథ్లెట్లు బరువైన రాళ్లను ఉపయోగిస్తారు.
వారు తమ బలం, నైపుణ్యాన్ని చూపించడానికి ఈ రాళ్లను లిఫ్ట్ చేస్తుంటారు.స్థానిక పండుగలు, కమ్యూనిటీ సమావేశాల సమయంలో పోటీలు నిర్వహిస్తుంటారు, ఈ పోటీల్లో 80 కిలోల నుంచి 400 కిలోల వరకు రాతి బరువులు ఉంటాయి.
చాలా మంది ఈ క్రీడ యువకులు ఆరోగ్యంగా ఉండటానికి, నేరాలు, డ్రగ్స్ వంటి ప్రతికూల ప్రభావాల నుంచి దూరంగా ఉండటానికి సహాయపడుతుందని నమ్ముతారు.

2019లో వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ మ్యాన్ పోటీలో గెలిచిన మార్టిన్స్ లిసిస్,( Martin’s Lysis ) ఈ ప్రత్యేకమైన పవర్‌లిఫ్టింగ్‌ను చూడడానికి పాకిస్థాన్‌ను సందర్శించారు.అతను రాళ్లను ఎత్తే సంఘటనల వీడియోలను రికార్డ్ చేశాడు.అథ్లెట్లు వారి సొంత శరీర బరువు కంటే రెట్టింపు బరువున్న రాళ్లను ఎత్తడం చూపించాడు.
ఒక వీడియోలో, జునైద్( Junaid ) అనే అథ్లెట్ తన భుజంపై 153 కిలోల రాయిని ఎత్తడానికి ప్రత్యేక సాంకేతికతను ఉపయోగించాడు.అతడు ఆ రాయిని బొమ్మలాగానే పైకి ఎత్తాడు.
మరో అథ్లెట్ ఉమైర్ హసన్ కేవలం 80 కిలోల బరువున్నప్పటికీ 200 కిలోల రాయిని ఎత్తగలిగాడు.అతను కూడా ఇది చిన్న పిల్లల బొమ్మ అన్నట్టు పైకి ఎత్తి కింద పడేసాడు.
ఈ శక్తి విన్యాసాలు ఆకట్టుకుంటాయి.అథ్లెట్ల అద్భుతమైన శక్తిని చూపించాయి.

పోస్ట్ చేసిన సమయం నుంచి ఈ వీడియోకు 88,000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి.లక్షల్లో వ్యూస్ వచ్చాయి.వ్యూయర్స్ సాంస్కృతిక వైవిధ్యం, వీడియోలలో చూపిన ప్రత్యేకమైన ట్రైనింగ్ టెక్నిక్‌ల పట్ల ప్రశంసలు వ్యక్తం చేశారు.మార్టిన్స్ మరొక వీడియోలో క్రీడ యొక్క నియమాలను కూడా పంచుకున్నారు.
‘క్లీన్’గా పిలిచే రాయిని నేల నుంచి భుజంపైకి ఎత్తేటప్పుడు ఆ రాయి శరీరానికి తగలకూడదని ఆయన వివరించారు.అథ్లెట్ పాయింట్లను స్కోర్ చేయడానికి దానితో చతికిలబడడానికి ముందు, పట్టుకున్నప్పుడు అది ఛాతీపై మాత్రమే ఉంటుంది.








