రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి.బయట కాలు పెట్టాలంటే జనాలు హడలిపోయే పరిస్థితి కనిపిస్తోంది .గత వందేళ్ళలో ఎప్పుడు లేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది .46 డిగ్రీల ఉష్ణోగ్రతలు( Temperatures of 46 degrees ) వరకు నమోదు అవుతుండడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు హడలిపోతున్నారు.ఇళ్లల్లో ఉన్నా.ఎండ వేడి కారణంగా ఆపసోపాలు పడుతున్నారు .నిప్పుల కుంపట్లో కూర్చున్నట్లుగానే పరిస్థితి ఉంది .ఉదయం 6 గంటల నుంచి ఉక్క పోత మొదలవడంతో జనాలు అల్లాడిపోతున్నారు.మే నెల మొదట్లోనే ఈ విధంగా ఉండడంతో, వచ్చే రోహిణి కార్తి ( Rohini Karti )నాటికి పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో అనే ఆందోళన జనాల్లో కనిపిస్తోంది.గతంలో ఇంత స్థాయిలో ఎండలు ఎప్పుడు జనాలు చూడలేదు.
ఉదయం నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది .రోడ్లన్నీ నిర్మాణస్యంగా మారుతున్నాయి .
అత్యవసర పనులు ఉంటే తప్ప , జనాలు బయటకు రావడం లేదు.ఇక అత్యవసర పనులు ఉంటే తప్ప జనాలు బయటకు రావద్దంటూ వైద్యులు కూడా సూచిస్తూ ఉండడంతో ఇళ్లకే పరిమితం అవుతున్నారు .పొలం పనులు ఉన్నా.ఉదయం , సాయంత్రం వేళల్లోనే చేసుకుంటూ మధ్యాహ్నం విశ్రాంతికే జనాలు ప్రాధాన్యం ఇస్తున్నారు .తెలంగాణలో( Telangana ) ఇప్పటికే 15 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ను వాతావరణ శాఖ ప్రకటించింది.
మరో 18 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్( Orange Alert ) ను ప్రకటించారు.వృద్ధులు, చిన్నపిల్లలు ఈ ఎండ తీవ్రత కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక ఏసీల వాడకం కూడా విపరీతంగా పెరిగింది.మరోవైపు ఎన్నికల సమయం కావడంతో ఈ ఎండల్లోనే రాజకీయ పార్టీల నాయకులు ప్రచారం నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది .ఆ సభలు, సమావేశాలకు జనాలు తరలింపు చేపట్టడమూ కష్టతరంగానే మారింది.మరికొద్ది రోజుల పాటు ఎండ తీవ్రతలు ఇదేవిధంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో జనాలు మరింత బెంబేలు చెందుతున్నారు.