రెండోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే లక్ష్యంతో ఉన్న ఏపీ అధికార పార్టీ వైసిపి( YCP ) ఈ ఎన్నికలను చాలా సీరియస్ గానే తీసుకుంది.ఒకవైపు టిడిపి, జనసేన బిజెపిలు కూటమిగా ఏర్పడి తమను ఓడించేందుకు ప్రయత్నిస్తూ ఉండడం, ప్రజలను ఆకట్టుకునే విధంగా ఎన్నికల మేనిఫెస్టోను తయారు చేయడంతో, వైసిపి కూడా అంతే స్థాయిలో ఆ పార్టీలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది.
ఇప్పటికే సిద్ధం, మేమంతా సిద్ధం పేరుతో సభలు, సమావేశాలు, రోడ్డు షోలు నిర్వహిస్తూ వస్తున్న జగన్( Jagan ), మరో కొత్త పార్టీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.రాష్ట్రవ్యాప్తంగా తీరికలేకుండా పర్యటనలు చేస్తున్న జగన్, పార్టీ శ్రేణులను ప్రజలకు మరింత దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఎన్నికల పోలింగ్ కు 10 రోజులు మాత్రమే సమయం ఉండడంతో, ప్రజల్లో వైసీపీ పై ఆదరణ ఏమాత్రం తగ్గకుండా సరికొత్త ఎత్తుగడలను అమలు చేస్తున్నారు.దీనిలో భాగంగానే ;జగన్ కోసం సిద్ధం.
పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఏపీలో ఉన్న ప్రతి ఇంటికి వైసీపీ మేనిఫెస్టో 2024( Manifesto 2024 ) ను చేరవేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.ఏపీలో జగన్ అధికారంలో ఉంటేనే రాష్ట్రంలో సంక్షేమం కొనసాగుతుందని, పేదల భవిష్యత్తు మారుతుందని ఈ కార్యక్రమం ద్వారా ప్రచారం చేయనున్నారు.ఈ రోజు పార్టీ కీలక నేతలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
ఇప్పటికే తమ ప్రభుత్వంలో సంక్షేమం పొందిన సామాన్యులే తమ పార్టీ స్టార్ క్యాంపైనర్ లంటూ సీఎం జగన్ చెబుతూ వస్తున్నారు.ఇప్పుడు ఆ సామాన్యులనే టార్గెట్ గా పెట్టుకుని జగన్ కోసం సిద్ధం కార్యక్రమాన్ని రూపొందించారు.
2019 ఎన్నికల్లో వైసిపి ప్రకటించిన మేనిఫెస్టోను దాదాపు 99 శాతం పూర్తి చేసామని, అదే ధీమాతోనే ఎన్నికలకు వెళ్లాలని వైసిపి నిర్ణయించుకుంది. చేసేది చెబుతామని, ఏమాత్రం అవకాశం ఉన్నా.ఇంకా ఎక్కువ చేస్తామని మేనిఫెస్టో ప్రకటన సమయంలోనే జగన్ క్లారిటీ ఇచ్చారు.మేనిఫెస్టోను ఒక ప్రోగ్రెస్ రిపోర్టు లాగా 58 నెలల కాలంలో ఎప్పటికప్పుడు చేసిన అభివృద్ధిని వివరిస్తూ వచ్చామని వైసిపి నేతలు పేర్కొంటున్నారు.
ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా ఇంటింటికీ వైసీపీ మేనిఫెస్టో వెళ్లే విధంగా వ్యూహాత్మకంగా జగన్ ప్లాన్ చేశారు.