త్వరలో లోక్ సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress)ఇవాళ మ్యానిఫెస్టో విడుదల చేయనుంది.ఈ మేరకు హైదరాబాద్ లోని గాంధీభవన్ లో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు.
తెలంగాణకు ప్రత్యేక మ్యానిఫెస్టోను కాంగ్రెస్ రిలీజ్ చేయనుంది.ఈ క్రమంలో కేంద్రంలో హస్తం పార్టీ గెలిస్తే ఏం చేస్తారనే దానిపై మ్యానిఫెస్టోలో వివరణ ఇవ్వనుంది.
అయితే ముందుగా తుక్కుగూడలో నిర్వహించిన భారీ బహిరంగ సభలోనే తెలంగాణ ప్రత్యేక మ్యానిఫెస్టోను(Manifesto) విడుదల చేయాలని భావించారు.ఈ నేపథ్యంలో 23కు పైగా హామీలతో మ్యానిఫెస్టోను సిద్ధం చేసినప్పటికీ చివరి నిమిషంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే.