సీటు విషయంలో ఓ మహిళ, ఓ యువతి మధ్య జరిగిన వాగ్వాదం చివరకు పెద్ద ఫైట్ కు దారి తీసింది. ఈ ఇద్దరూ బస్సులో ఒకరి జుట్టు మరొకరు పట్టుకొని చాలా దారుణంగా కొట్టేసుకున్నారు.
వారిని ఎవరూ కూడా ఆపలేకపోయారు.ఒక వ్యక్తి మాత్రం వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు.
అది కాస్త వైరల్‌గా మారింది.వైరల్ వీడియోలో ఒక మహిళ, ఒక అమ్మాయి ఒకరి జుట్టు మరొకరు లాగడం చూడవచ్చు.
తర్వాత భీకర పోరుకు దిగడం గమనించవచ్చు.
వీడియోలో ఇద్దరు ఆడవారు ఒకరినొకరు కొట్టుకుంటూ వాదించుకోవడం చూడవచ్చు.
కొందరు వ్యక్తులు గొడవలో జోక్యం చేసుకుని కొట్లాటను ఆపే ప్రయత్నం చేయడం కనిపించింది.అయితే బస్సులో గందరగోళం నెలకొనడంతో కొంత సేపు గొడవ కొనసాగింది.
తర్వాత కొందరు పోలీసు కానిస్టేబుళ్లు బస్సు లోపలికి వచ్చి వారిని వాహనంలో నుంచి బయటకు దింపడం కనిపించింది.అయితే, బస్సు దిగిన తర్వాత కూడా వారు ఒకరినొకరు కొట్టుకోవడం కనిపించింది.
కానిస్టేబుల్ కూడా వీరిని ఆపలేకపోయారు.వీడియో చివర్లో కూడా వీరు విపరీతంగా కొట్టుకుంటూ కనిపించారు.
తర్వాత పోలీసులు వారికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారో తెలియ రాలేదు.
ట్విట్టర్ యూజర్ ఘర్ కే కాలేష్ షేర్ చేసిన ఈ వీడియోకి వేలల్లో వ్యూస్ వచ్చాయి.చాలామంది సీటు విషయంలో ఇలా కొట్టుకోవాల్సిన అవసరం ఏముంది సర్దుకుపోతే సరిపోతుంది కదా అని కామెంట్లు పెడుతున్నారు.బయట వ్యక్తుల్లో చాలామంది ఇరిటేట్ చేస్తారని, అంత మాత్రాన కోపం తెచ్చుకొని నవ్వులు పాలు కాకూడదని మరికొందరంటున్నారు.
పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ఇలాంటి దృశ్యాలను ఎదుర్కొన్నామని చాలామంది నెటిజన్లు పేర్కొన్నారు.