చిత్రం : గురు
బ్యానర్ : వై నాట్ స్టూడియోస్
దర్శకత్వం : సుధ కొంగర
నిర్మాత : ఎస్.శశికాంత్
సంగీతం : సంతోష్ నారయణణ్
విడుదల తేది : మార్చి 31, 2017
నటీ-నటులు – వెంకటేష్, రితికా సింగ్, నాజర్ తదితరులు
బాలివుడ్ అగ్రదర్శకుడు రాజ్ కుమార్ హిరాని నిర్మాణంలో, సుధ కొంగర దర్శకత్వంలో హిందీ – తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం సాలా ఖడూస్ (తమిళంలో ఇరుద్ది సుట్రు).విమర్శకుల ప్రశంసలు బాగా పొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం ఫ్లాప్ గా నిలిచింది.అయినా, కథను నమ్మి దీన్నీ గురు పేరుతో తెలుగులోకి మళ్ళీ అదే దర్శకురాలితో రీమేక్ చేసారు విక్టరీ వెంకటేష్.
మరి తెలుగు రీమేక్ ఒరిజినల్ ని మించి ఫలితాల్ని ఇస్తుందో లేదో చూద్దాం.
కథలోకి వెళితే :
తన తప్పు లేకున్నా, ఛాంపియన్ బాక్సర్ గా ఎదగలేకపోకపోతాడు ఆదిత్య (వెంకటేష్).సహజంగామే కోపిష్టి అయిన ఆదిత్య, తన ఓటమి, బాక్సింగ్ ప్రపంచంలో ఉన్న రాజకీయాల వలన ఒక ఆరోగెంట్ మెన్ గా మారతాడు.తన ప్రవర్తన తన ఇష్టం అన్నట్టుగా ఉంటుంది.
ఇలాంటి కోపిష్టి బాక్సర్ ని ఇండియన్ వుమెన్ బాక్సింగ్ టీమ్ కి కోచ్ గా నియమించినా, తన దూకుడు వలన వైజాగ్ పంపించేస్తారు అధికారులు.
వైజాగ్ లో కూరగాయలు అమ్ముకునే రామేశ్వరిలో (రితికా సింగ్) లో ఒక బాక్సర్ ప్రతిభ కనిపిస్తుంది అదిత్యకి.
తన కన్న కల తన శిష్యురాలి ద్వారా తీర్చుకోవాలనుకుంటాడు ఈ గురు.దూకుడు అదుపులో లేని ఈ గురుతో ఆ శిష్యురాలితో ప్రయాణం ఎలా సాగింది.
వారిద్దరి మధ్య సంఘర్షణ, రామేశ్వరిని ఛాంపియన్ చేయడం కోసం గురువు పడే తాపత్రయం … ఆ భావోద్వేగాలు అన్నీ తెర మీద చూడాల్సిందే.
నటీనటులు నటన :
గత కొన్ని సంవత్సరాల్లో వెంకటేష్ పోషించిన బెస్ట్ పాత్ర ఇదే, అలాగే వెంకటేష్ నుంచి వచ్చిన బెస్ట్ పెర్ఫార్మెన్స్ కూడా ఇదే.రగ్గిష్, రా పెర్ఫామెన్స్ తో వెంకటేష్ విపరీతంగా అకట్టుకుంటారు.“గెట్టింగ్ ఇన్ టు ది స్కిన్ ఆఫ్ క్యారెక్టర్” అని ఆంగ్లంలో అన్నట్లు, దూకుడు, ఈగో ఉన్న బాక్సింగ్ కోచ్ పాత్ర యొక్క చర్మాన్ని ధరించారు వెంకటేష్.సహజంగా రీమేక్ సినిమాల్లో ఒరిజినల్ పాత్రధారులని మరిపించటం కష్టం, కాని వెంకటేష్ మాధవన్ ని మరిపించేలా ఈ పాత్రను పోషించారు.సినిమాకి ఆయన బాడి లాంగ్వేజ్, రగ్డ్ లుక్, ఆరోగెంట్ అభినయం రక్తం, మాంసం, అయువు లాంటివి.
అదే పాత్రను మూడోవసారి పోషించింది రితీకా సింగ్, మూడొవసారి మెరిసింది.ఒరిజినల్ చూసిన వారికి ఈ సినిమాలో అమెకు చెప్పిన డబ్బంగ్ కాస్త ఎబ్బెట్టుగా అనిపించవచ్చు కాని, సాలా ఖడూస్ చూడని వారికి ఆ కంప్లయింట్ ఉండకపోవచ్చు.
ఇటు రితికా పాత్ర, అటు నాజర్ పాత్ర సాధారణంగా తెలుగు సినిమాల్లో కనబడవు కాబట్టి మన తెలుగు ప్రేక్షకులు ఇంత “రా” పాత్రలని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఆసక్తికరం.
టెక్నికల్ టీమ్ :
శక్తివేల్ సినిమాటోగ్రాఫి ఈ సినిమాకి పెద్ద బలం.అద్యంతం బ్రౌనిష్ కలరింగ్ తో సినిమా మొత్తం నెచురల్/రా టోన్ మేయింటేన్ చేస్తూ, అదే గ్రేడింగ్ ఓ బాక్సింగ్ సినిమాకి అవసరమైన సీనరీ టెంపోని మెయింటేన్ చేసారు.ఎడిటింగ్ షార్ప్ గా ఉంది.
కాని ఇలాంటి ఎడిటింగ్ పద్ధతులు తెలుగు సినిమా వరకు పెద్దగా చూడనివి, దీన్నీ కూడా తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.సంగీతం, నేపథ్య సంగీతం సందర్భానుసారంగా, సముచితంగా ఉన్నాయి.
సుధ కొంగర కథ ఇంతవరకు మనం చూడలేదని కాదు కాని, కథనం ఫ్రెష్ గా ఉంటుంది.ఆ కొత్తదనం ఎలా వచ్చింది అంటే అదే వెంకటేష్ పాత్ర స్వభావం వలన.నిర్మాణ విలువలు బాగున్నాయి.
విశ్లేషణ :
గురు మనకు తెలియని కథ కాదు.ఇంచుమించు ఇదే కథాంశాన్ని ఇంతకుముందే షారుఖ్ ఖాన్ “చక్ దే ఇండియా” లో, పాత్ర స్వభావంలో కాస్తంత పోలిక ఆమీర్ ఖాన్ “దంగల్” లో చూసాం.చక్ దే ఇండియా, దంగల్, గురు .మూడు సినిమాల మూలకథ ఒక్కట్టే … తాను సాధించలేకపోయిన విజయాన్ని తన శిక్షణలో తమ శిష్యులు సాధించాలనుకునే మొండి గురువుల కథలే ఈ మూడు.కాని గురుకి ఆ రెండు సినిమాలకి తేడా ఎక్కడ వచ్చింది అంటే, క్యారక్టర్ డిజైన్ లో.ఇక్కడ కోచ్ కి దూకుడు, దురుసు, రెండు కబీర్, మహవీర్ ఫోఘట్ కంటే మూడింతలు ఎక్కువ.అందుకే, గురు శిష్యుల మధ్య సంఘర్షణ మరింత రక్త కడుతుంది.
కాని కథ మాత్రం చక్ దే, దంగల్ లోనే బలంగా ఉంటుంది.అందుకే, బాలివుడ్ లో ఈ సినిమా టేకింగ్ కి విమర్శకుల ప్రశంసలు దక్కాయి కాని, కథకి కాసులు పడలేదు.
గురులో పెద్దగా మార్పులేమి చేయలేదు.ఒకే దర్శకురాలు కావడంతో మళ్ళీ కొత్తగా ఆలోచించకుండా ఉన్నది ఉన్నట్లుగానే తీసేసింది.
స్పోర్ట్ డ్రామాలు తెలుగులోకి రావాలి అనే అభిరుచి ఉన్నవారు, సాలా ఖడూస్ చూడని వారు ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేయవచ్చు.ఇక ఒరిజినల్ ఈపాటికే చూసిన, వెంకి అభినయం కోసం ఈజీగా ఓ రౌండు చేయవచ్చు.
బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకి ఎలాంటి అవకాశాలు ఉంటాయో మీకు కూడా అర్థమయ్యిపోయి ఉంటుంది.ఏ సెంటర్లలో మంచి పుల్ ఉన్న సినిమా.
కాని మాస్ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.ఒకవేళ ఇలా క్లాసు తేడాలు లేకుండా ఈ సినిమా యూనివర్సల్ హిట్ గా నిలిస్తే మాత్రం, తెలుగు సినిమాకి మంచి రోజులు వచ్చేసినట్టే.
ప్లాస్ పాయింట్స్ :
* వెంకటేష్ * రితికా, సపోర్టింగ్ క్యాస్ట్ పెర్ఫామెన్స్ * పాత్రల మధ్య సంఘర్షణ, భావోద్వేగాలు * ఎక్కడా గతి తప్పని టేకింగ్
మైనస్ పాయింట్స్
* ఉడికి ఉడకని కొన్ని సన్నివేశాలు * నో కమర్షియల్ ఎలిమెంట్స్ (బిజినెస్ పరంగా)
చివరగా :
మ్యాటర్ ఉన్న గురు
తెలుగుస్టాప్ రేటింగ్
3.5/5