కాష్మోరా రివ్యూ

చిత్రం : కాష్మోరా

 Kaashmora Movie Review-TeluguStop.com

బ్యానర్ : డ్రీమ్ వారియర్ పిక్చర్స్, పివిపి సినిమా (పంపిణీ)

దర్శకత్వం : గోకుల్

నిర్మాత : ఎస్.అర్.

ప్రకాష్ బాబు, ఎస్.అర్.ప్రభు

సంగీతం : సంతోష్ నారాయణన్

విడుదల తేది : అక్టోబరు 28, 2016

నటీనటులు : కార్తీ, నయనతార, శ్రీదివ్య తదితరులు

హీరో కార్తీకి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది.ఊపిరి చిత్రం విడుదలకి ముందు కార్తీ డబ్బింగ్ సినిమాలకి మంచి మార్కేట్ ఉండేది.

ఊపిరి లాంటి హిట్ తరువాత ఆ మార్కేట్ మరింత పెరిగింది.దాంతో కాష్మోరా హక్కులని పెద్ద మొత్తానికే కొనుక్కుంది పీవిపి సంస్థ.

మరి కాష్మోరా అంచనాలు అందుకునేలా ఉందా లేదా చూడండి

కథలోకి వెళ్తే …

కాష్మోరా (కార్తీ), దెయ్యాలని వెళ్ళగొట్టేవాడిగా జనాల్ని నమ్మిస్తుంటాడు.తన తండ్రితో కలిసి మోసాలు చేస్తుంటాడు.

అయితే కాష్మోరా ఒక పాత రాజభవనంలో చిక్కుకుపోతాడు.ఆ భవనంలో ఆత్మగా మారి తిరుగుతుంటాడు రాజ్ నాయక్ (కార్తీ)

ఈ రాజ్ నాయక్ ఏడు శతాబ్దాల క్రితం విక్రాంతక రాజ్యానికి ప్రధాన యోధుడు.

అతనికి, ఆ రాజ్యం యొక్క యువరాణి రత్న మహాదేవికి (నయనతార ) మధ్య ఆ కాలంలో ఏం జరిగింది? అసలు రాజ్ నాయక్ ఆత్మ ఎందుకు ఇంకా ఈ ప్రపంచంలో తిరుగుతోంది? కాష్మోరా రాజ్ నాయక్ ఆత్మతో ఎలాంటి తంటాలు పడ్డాడు, ఏం చేయగలిగాడు అనేది తెర మీద చూడాలి

నటీనటుల నటన :

కార్తీ పాత్రల వ్యవహార శైలికి తగ్గట్టుగా తనని తాను రెండు రకాలుగా బాగా మలుచుకున్నాడు.కార్తీ కామెడి టైమింగ్ ఎలాంటిదో ఊపిరిలో చూశాం, ఇందులో కూడా ఇంటర్వల్ కి ముందు వచ్చే ఎపిసోడ్లలో కార్తి కామెడీ హైలెట్.

ఇక రాజ్ నాయక్ పాత్రలో కార్తి మరింత మెప్పిస్తాడు.లుక్, ఆటిట్యూడ్ అన్ని అతికటిపోయినట్టుగా అనిపిస్తుంది.
నయనతార అందంగా ఉంది.అభినయం కూడా బాగుంది కాని తన పాత్రను ఇంకా బాగా రాయాల్సింది.

వివేక్ కామెడీ ఫర్వాలేదు.శ్రీదివ్య కూడా ఓకే
సాంకేతికవర్గం పనితీరు

సినిమాటోగ్రాఫి చాలా పెద్ద అస్సెట్ ఈ సినిమాకి.

ఆర్ట్ వర్క్ కూడా బాగుంది.ఎడిటింగ్ సినిమాని బాగా దెబ్బతీసింది.

నిడివి ఎక్కువైపోయింది.అవసరం లేని సన్నివేశాలు కూడా ఉన్నాయి.

స్టంట్స్ బాగా డిజైన్ చేశారు

సంగీతం పెద్ద మైనస్ పాయింట్.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని జానర్ కి ఉండాల్సిన రేంజ్ లో లేదు.

నిర్మాణ విలువలు అదుర్స్

విశ్లేషణ

సరిగ్గా ఇలాంటి కథ మన తెలుగు ప్రేక్షకులు ఇప్పటికే చూశారు.అదే అరుంధతి.

ఆ సినిమా కి మార్పులు చేసి, బాహుబలి లాంటి వార్ ఎపిసోడ్ జత చేసినట్టు అనిపిస్తుంది కాష్మోరా.కార్తీ కష్టం, నటనాచాతుర్యం తప్ప, దర్శకుడి ప్రతిభ పెద్దగా కనబడని సినిమా ఇది.కామేడి కొన్ని చోట్ల నవ్వించినా, కొన్ని సన్నివేశాలు తమిళ వాసనతో ఉండటంతో, అవి మనవారికి ఎంతవరకు నచ్చుతాయి అనేది అనుమానమే.అంతేకాదు, కార్తి రాజ్ నాయక్ కి సరితూగే పాత్ర మరొకటి లేదు సినిమాలో.

మీరు బాహుబలి తీసుకున్నా, అరుంధతి తీసుకున్నా, బలమైన పాత్రలు, వాటి మధ్య సంఘర్షణ ఉంటుంది.ఈ సినిమాలో ఆ ఫ్లేవర్ కొద్దిగా మిస్ అయ్యింది

ఓవరాల్ గా చెప్పాలంటే, కార్తీ కోసం ఓసారి చూడగలిగే సినిమా.భారీ రేట్లకు ఓ యావరేజ్ సినిమాను అమ్మడం బయ్యర్లను కలవరపెట్టే విషయం

హైలైట్స్ :

* కార్తీ

* సినిమాటోగ్రాఫి, ఆర్ట్

* ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు

* కొన్ని కామెడి సన్నివేశాలు

డ్రాబ్యాక్స్ :

* కొద్దిగా తెలిసిన కథ కావడం

* ఎడిటింగ్
* తమిళ వాసన కొట్టే కొన్ని సీన్స్, తెలుగువారికి కనెక్టింగ్ గా అనిపించని ఆర్టిస్టులు

చివరగా :

సగం ఉడికింది!

తెలుగుస్టాప్ రేటింగ్ : 2.75/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube