గుంటూరు నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం, అన్నమయ్య పార్కులను ఈ రోజు ఉదయం మంత్రి విడదల రజిని( Minister Vidadala Rajini ) సందర్శించారు.వాకింగ్ ట్రాక్‌లోని పౌరులను పలుకరించారు.
గుంటూరు నగర( Guntur ) సమగ్ర అభివృద్ధే తమ ధ్యేయమని చెప్పారు.గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఐదేళ్లలో 500 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందని చెప్పారు.
డివిజన్ల వారీగా ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసేవిధంగా చర్యలు తీసుకోబోతున్నామని తెలిపారు.గుంటూరు పశ్చిమ అభ్యర్థిగా తాను వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగబోతున్నానని, ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.