*
మాయమాటలతో,సాధ్యంకాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని విశాఖ తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ అధికారప్రతినిధి విల్లూరి డాక్టర్ చక్రవర్తి అన్నారు.జీవీఎంసీ 33 వ వార్డు కొల్లివారి వీధి నుంచి వై ఎస్ ఆర్ సి పి నాయకురాలు శ్రీమతి కలిగొట్ల హేమలక్ష్మి తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ అధికార ప్రతినిధి విల్లూరి డాక్టర్ చక్రవర్తి మరియు 33వ వార్డు క్లస్టర్ ఇన్‌చార్జ్ శ్రీమతి విల్లూరి తిరుమల దేవి చక్రవర్తి మరియు వార్డు అధ్యక్షుడు శ్రీ బంటుపల్లి సూర్యనారాయణ ఆధ్వర్యంలో,విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీ గండి బాబ్జీ గారి నాయకత్వంలో సుమారు 50 మంది మహిళలతో తెలుగుదేశం పార్టీలో చేరారు.
వారికి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో గండిబాబ్జీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా బాబ్జి మాట్లాడుతూ జగన్ అసమర్ధ పాలనతో రాష్ట్ర ప్రజలు ఎన్నో ఇక్కట్లను ఎదుర్కొంటున్నారన్నారు.
రాష్ట్రానికి అనుభవజ్ఞుడైన నాయకుడు అవసరమని, చంద్రబాబు నాయకత్వమే రాష్ట్రానికి శరణ్యమని భావించి పార్టీలో చేరిన శ్రీమతి కలిగొట్ల హేమలక్ష్మి తదితరులను అయన అభినందించారు.త్వరలో మరింతమంది పార్టీలో చేరతారని బాబ్జీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్స్, కార్పొరేటర్ అభ్యర్థులు, పార్లమెంట్ కమిటీ, అనుబంధ సంఘాల వారు , వార్డు అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.