బాలీవుడ్ సినిమాలలో మాత్రమే కాకుండా సౌత్ సినిమాలలో కూడా విలన్ పాత్రలలో నటిస్తూ అందరిని భయపెట్టిన నటుడు సోను సూద్(Sonu Sood) గురించి అందరికీ తెలిసిందే.ఈయన సినిమాలలో విలన్ పాత్రలలో నటించిన నిజజీవితంలో మాత్రం హీరో అని చెప్పాలి.
ప్రపంచవ్యాప్తంగా అందరిని భయభ్రాంతులకు గురిచేసిన కరోనా మహమ్మారి వ్యాప్తి చెందినపుడు సోను సూద్ దేశ ప్రజలకు చేసిన సేవలు గురించి అందరికీ తెలిసిందే.అయితే ఈయన సేవా కార్యక్రమాలు అంతటితో ఆపకుండా చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు చేస్తూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.
ఇలా ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ ప్రతి ఒక్క ప్రాంతంలోనూ సోనూ సూద్ సహాయం పొందిన వారు ఉన్నారనే చెప్పాలి.ఇక ఈయన తన అభిమానులతో కలిసి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను కూడా చేస్తూ తన మంచితనాన్ని ఎప్పటికప్పుడు చాటుకుంటూ ఉన్నారు.ఇకపోతే ఈయన నుంచి లబ్ది పొందిన వారు తనపై వారికి ఉన్నటువంటి అభిమానాన్ని వివిధ రకాలుగా ప్రదర్శిస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే తాజాగా ఓ అభిమాని ఏకంగా బియ్యంతో(Rice) సోనుసూద్ రూపాన్ని ఆవిష్కరించారు.
మధ్యప్రదేశ్ లోని దేవాస్ లో ఉన్న తుకోజీరావు పవార్ స్టేడియంలో ఏకరా స్థలంలోసోను సూద్ చిత్రాన్ని బియ్యంతో రూపొందించారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.నేలపై ప్లాస్టిక్ షీట్లను పరిచి దానిపై 2500 కిలోల బియ్యంతో ముఖ చిత్రాన్ని ఆవిష్కరించారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ వీడియో పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇలా ఆయన నుంచి సహాయ సహకారాలు పొందిన వారందరూ కూడా ఇలా ఎప్పటికప్పుడు వినూత్న రీతిలో తనపై ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకుంటున్నారు.