ఢిల్లీ వేదికగా విపక్షాల ఐక్యతకు తొలి అడుగు పడింది.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ ఐక్యంగా వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాయి.
ఈ మేరకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, బీహార్ సీఎం నితీశ్ కుమార్.తేజస్వీయాదవ్ ఉమ్మడిగా ప్రకటన చేశారు.
ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఇదో చారిత్రక అడుగని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.దేశం కోసం అందరం కలిసికట్టుగా ఉంటామని తెలిపారు.
ఈ క్రమంలోనే వీలు అయినన్నీ పార్టీలను ఏకం చేస్తామని బీహార్ సీఎం నితీశ్ కుమార్ స్పష్టం చేశారు.







