ఎంత మంచి టాక్ వచ్చినా 'ఎఫ్ 3' నష్టాలను చవిచూడక తప్పలేదా?

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా ‘ఎఫ్ 3’.ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా వచ్చింది.

 F3 Box Office Collections, Tamanna, Mehreen, F3 Movie, Anil Ravipudi, Venkatesh,-TeluguStop.com

ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అనిల్ ఎఫ్ 3 సినిమాను కూడా చేసాడు.ఈ సినిమా గత నెల 27న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

దేవిశ్రీ సంగీతం అందించగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో ఈ సినిమాను శిరీష్ నిర్మించారు.

ఇందులో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించగా.

వీరిద్దరికి జోడీగా తమన్నా భాటియా, మెహ్రీన్ నటించారు. అలాగే అదనపు ఆకర్షణగా అనిల్ సోనాల్ చౌహన్, పూజా హెగ్డే ను కూడా తీసుకు వచ్చాడు.

ఈ సినిమా అందరి అంచనాల మధ్య గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.అలాగే తొలిరోజు నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

దీంతో ఈ సినిమా మొదటి వారం కలెక్షన్ల పరంగా దూసుకు పోయింది.

అయితే రెండవ వారం మాత్రం ఎఫ్ 3 సినిమాకు ఊహించని షాక్ తగిలింది.

ఈ సినిమా ఒక వారం రోజుల పాటు ఎలాంటి పోటీ లేకుండా కలెక్షన్స్ ను తన ఖాతాలో వేసుకుంది.అయితే ఈ సినిమా రెండవ వారంలోకి అడుగు పెట్టిన తర్వాత మాత్రం ఈ సినిమాకు గట్టి పోటీ నెలకొంది.

ఈ సినిమాకు పోటీగా మేజర్, విక్రమ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి.ఈ రెండు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఎఫ్ 3 సినిమాకు దెబ్బ గట్టిగానే తగిలింది.

Telugu Anil Ravipudi, Box, Mehreen, Tamanna, Varun Tej, Venkatesh-Movie

ఫలితంగా కొన్ని ఏరియాల్లో బయ్యర్లు నష్టపోయే పరిస్థితి వచ్చింది.ఎఫ్ 2 భారీ విజయం అందుకోవడంతో ఎఫ్ 3 సినిమాను అధిక రేట్లకు అమ్మడంతో బిజినెస్ బాగా జరిగింది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా తీసుకున్న డిస్టిబ్యూటర్స్ 10 నుండి 20 శాతం నష్టాలు పొందారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.మరి ఈ సినిమాలో ఇంత మంది స్టార్స్ నటించినా, వరుస ప్రొమోషన్స్ చేసిన కూడా ఈ సినిమా నష్టాల బారి నుండి తప్పించుకోలేక పోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube