ఎంత మంచి టాక్ వచ్చినా 'ఎఫ్ 3' నష్టాలను చవిచూడక తప్పలేదా?

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా 'ఎఫ్ 3'.ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా వచ్చింది.

ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అనిల్ ఎఫ్ 3 సినిమాను కూడా చేసాడు.

ఈ సినిమా గత నెల 27న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.దేవిశ్రీ సంగీతం అందించగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో ఈ సినిమాను శిరీష్ నిర్మించారు.

ఇందులో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించగా.వీరిద్దరికి జోడీగా తమన్నా భాటియా, మెహ్రీన్ నటించారు.

అలాగే అదనపు ఆకర్షణగా అనిల్ సోనాల్ చౌహన్, పూజా హెగ్డే ను కూడా తీసుకు వచ్చాడు.

ఈ సినిమా అందరి అంచనాల మధ్య గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.అలాగే తొలిరోజు నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

దీంతో ఈ సినిమా మొదటి వారం కలెక్షన్ల పరంగా దూసుకు పోయింది.అయితే రెండవ వారం మాత్రం ఎఫ్ 3 సినిమాకు ఊహించని షాక్ తగిలింది.

ఈ సినిమా ఒక వారం రోజుల పాటు ఎలాంటి పోటీ లేకుండా కలెక్షన్స్ ను తన ఖాతాలో వేసుకుంది.

అయితే ఈ సినిమా రెండవ వారంలోకి అడుగు పెట్టిన తర్వాత మాత్రం ఈ సినిమాకు గట్టి పోటీ నెలకొంది.

ఈ సినిమాకు పోటీగా మేజర్, విక్రమ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి.ఈ రెండు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఎఫ్ 3 సినిమాకు దెబ్బ గట్టిగానే తగిలింది.

"""/"/ ఫలితంగా కొన్ని ఏరియాల్లో బయ్యర్లు నష్టపోయే పరిస్థితి వచ్చింది.ఎఫ్ 2 భారీ విజయం అందుకోవడంతో ఎఫ్ 3 సినిమాను అధిక రేట్లకు అమ్మడంతో బిజినెస్ బాగా జరిగింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా తీసుకున్న డిస్టిబ్యూటర్స్ 10 నుండి 20 శాతం నష్టాలు పొందారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

మరి ఈ సినిమాలో ఇంత మంది స్టార్స్ నటించినా, వరుస ప్రొమోషన్స్ చేసిన కూడా ఈ సినిమా నష్టాల బారి నుండి తప్పించుకోలేక పోయింది.

పోలిష్ యూట్యూబర్ కరోలినా గోస్వామిపై ధృవ్ రాథీ ఫ్యాన్స్ అటాక్..??