Visakhapatnam : విశాఖలో డ్రగ్స్ పట్టివేత.. 25 వేల కిలోల డ్రగ్స్ సీజ్

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒక్కసారిగా డ్రగ్స్( Drugs ) కలకలం చెలరేగింది.విశాఖ తీరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి.

 Drug Bust In Visakha 25 Thousand Kg Of Drugs Seized-TeluguStop.com

బ్రెజిల్ నుంచి విశాఖలోని ఓ ప్రైవేట్ ఎక్స్ పోర్ట్స్ కు డ్రగ్స్ లోడ్ తో ఉన్న కంటైనర్ వచ్చిందని తెలుస్తోంది.ఈ కంటైనర్ లో నిషేధిత డ్రగ్స్ సుమారు 25 వేల కిలోలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఇంటర్ పోల్ సమాచారంలో సీబీఐ( CBI ) రంగంలోకి దిగింది.డ్రగ్స్ వ్యవహారంపై కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.ఈ నెల 16వ తేదీన విశాఖ తీరానికి డ్రగ్స్ కంటైనర్ ఉన్న నౌక వచ్చిందని తెలుస్తోంది.కాగా జర్మనీలోని హ్యాంబర్గ్ మీదుగా విశాఖకు( Visakhapatnam ) వచ్చిన కంటైనర్ లో ఈ నెల 19న సీబీఐ మరియు ఇంటర్ పోల్ కస్టమ్స్ అధికారులు సంయుక్తంగా ‘ ఆపరేషన్ గరుడ’( Operation Garuda ) పేరుతో తనిఖీలు నిర్వహించారు.

ఈ క్రమంలోనే సుమారు 25 కిలోల చొప్పున వెయ్యి డ్రగ్స్ బ్యాగులను అధికారులు గుర్తించారు.

Telugu Brazil, Drugs Ship, Interpol, Garuda, Santos Port, Visakha Port, Visakhap

అయితే బ్రెజిల్ లోని సాంటోస్ పోర్ట్( Santos Port ) నుంచి విశాఖకు కన్‎సైన్ మెంట్ వచ్చింది.అయితే ఫుడ్ సప్లిమెంట్ రూపంలో డ్రగ్స్ తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఇంటర్ పోల్ ద్వారా సీబీఐకి సమాచారం వచ్చింది.దీంతో ఇంటర్ పోల్, సీబీఐ మరియు కస్టమ్స్ అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ గరుడను నిర్వహించారు.

ఈ నెల 18న ఈ -మెయిల్ ద్వారా సీబీఐకి కీలక సమాచారం వచ్చిందని తెలుస్తోంది.అలాగే ఇందులో అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ ప్రమేయం ఉన్నట్లు ఇంటర్ పోల్ అధికారులు గుర్తించారు.

బ్రెజిల్( Brazil ) నుంచి విశాఖకు వచ్చిన ఈ డ్రగ్స్ కంటైనర్ ను ఎవరికి డెలివరీ ఇస్తారనే విషయం ఇంకా బయటకు రాలేదు.అయితే ఈ డ్రగ్స్ కంటైనర్ ఓ ప్రైవేట్ కంపెనీ పేరు మీద డెలీవరి అడ్రస్ ఉన్నట్లు తెలుస్తోంది.

అదేవిధంగా ఈ డ్రగ్స్ ప్రతిపక్ష నేత ఆర్డర్ ప్రకారం వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయని తెలుస్తోంది.అయితే ఇది ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.

రూ.వేల కోట్ల విలువైన డ్రగ్స్ ను సీజ్ చేసిన అధికారులు ఈ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారనే దానిపై సమగ్ర విచారణ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube