Visakhapatnam : విశాఖలో డ్రగ్స్ పట్టివేత.. 25 వేల కిలోల డ్రగ్స్ సీజ్

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒక్కసారిగా డ్రగ్స్( Drugs ) కలకలం చెలరేగింది.

విశాఖ తీరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి.బ్రెజిల్ నుంచి విశాఖలోని ఓ ప్రైవేట్ ఎక్స్ పోర్ట్స్ కు డ్రగ్స్ లోడ్ తో ఉన్న కంటైనర్ వచ్చిందని తెలుస్తోంది.

ఈ కంటైనర్ లో నిషేధిత డ్రగ్స్ సుమారు 25 వేల కిలోలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఇంటర్ పోల్ సమాచారంలో సీబీఐ( CBI ) రంగంలోకి దిగింది.డ్రగ్స్ వ్యవహారంపై కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

ఈ నెల 16వ తేదీన విశాఖ తీరానికి డ్రగ్స్ కంటైనర్ ఉన్న నౌక వచ్చిందని తెలుస్తోంది.

కాగా జర్మనీలోని హ్యాంబర్గ్ మీదుగా విశాఖకు( Visakhapatnam ) వచ్చిన కంటైనర్ లో ఈ నెల 19న సీబీఐ మరియు ఇంటర్ పోల్ కస్టమ్స్ అధికారులు సంయుక్తంగా ‘ ఆపరేషన్ గరుడ’( Operation Garuda ) పేరుతో తనిఖీలు నిర్వహించారు.

ఈ క్రమంలోనే సుమారు 25 కిలోల చొప్పున వెయ్యి డ్రగ్స్ బ్యాగులను అధికారులు గుర్తించారు.

"""/" / అయితే బ్రెజిల్ లోని సాంటోస్ పోర్ట్( Santos Port ) నుంచి విశాఖకు కన్‎సైన్ మెంట్ వచ్చింది.

అయితే ఫుడ్ సప్లిమెంట్ రూపంలో డ్రగ్స్ తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఇంటర్ పోల్ ద్వారా సీబీఐకి సమాచారం వచ్చింది.

దీంతో ఇంటర్ పోల్, సీబీఐ మరియు కస్టమ్స్ అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ గరుడను నిర్వహించారు.

ఈ నెల 18న ఈ -మెయిల్ ద్వారా సీబీఐకి కీలక సమాచారం వచ్చిందని తెలుస్తోంది.

అలాగే ఇందులో అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ ప్రమేయం ఉన్నట్లు ఇంటర్ పోల్ అధికారులు గుర్తించారు.

బ్రెజిల్( Brazil ) నుంచి విశాఖకు వచ్చిన ఈ డ్రగ్స్ కంటైనర్ ను ఎవరికి డెలివరీ ఇస్తారనే విషయం ఇంకా బయటకు రాలేదు.

అయితే ఈ డ్రగ్స్ కంటైనర్ ఓ ప్రైవేట్ కంపెనీ పేరు మీద డెలీవరి అడ్రస్ ఉన్నట్లు తెలుస్తోంది.

అదేవిధంగా ఈ డ్రగ్స్ ప్రతిపక్ష నేత ఆర్డర్ ప్రకారం వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయని తెలుస్తోంది.

అయితే ఇది ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.రూ.

వేల కోట్ల విలువైన డ్రగ్స్ ను సీజ్ చేసిన అధికారులు ఈ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారనే దానిపై సమగ్ర విచారణ చేస్తున్నారు.

పుష్ప ది రూల్ సక్సెస్ క్రెడిట్ సుకుమార్ రెడ్డిదే.. వైరల్ అవుతున్న బన్నీ కామెంట్స్!