నష్టాల్లో ట్రూత్ సోషల్ షేర్లు.. పడిపోయిన ట్రంప్ సంపద విలువ

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో దూసుకెళ్తున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను( Donald Trump ) వ్యక్తిగత సమస్యలు వెంటాడుతున్నాయి.న్యూయార్క్ సివిల్ ఫ్రాడ్ కేసులో తాజాగా కోర్టులో 175 బిలియన్ డాలర్ల బాండ్ సమర్పించారు.

 Donald Trump Net Worth Plunges 1bn Dollars After Truth Social 58mn Dollars Loss-TeluguStop.com

దీని వల్ల న్యాయస్థానం తనకు విధించిన 454 మిలియన్ డాలర్ల జరిమానా విషయంలో తదుపరి చర్యలు తీసుకోకుండా చూసుకోగలిగారు.అంతేకాదు.

తన ఆస్తులను జప్తు చేసే అవకాశం కూడా లేకుండా వ్యవహరించగలిగారు.ఇదిలావుండగా.

నాస్‌డాక్‌లో బ్లాక్‌బస్టర్ రేంజ్‌లో ఎంట్రీ ఇచ్చిన ట్రంప్‌కు చెందిన ట్రూత్ సోషల్ .( Truth Social ) స్టాక్ మార్కెట్‌లను ఆకట్టుకోవడంలో విఫలమైంది.ట్రూత్ సోషల్ మాతృసంస్థ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ( Trump Media And Technology Group ) గ్రూపులో పెట్టుబడిదారులు దాని వ్యాపార ప్రాథమిక అంశాలను నిశితంగా పరిశీలిస్తూ వుండటంతో షేర్లు 21.5 శాతం పడిపోయాయి.

Telugu Bfborgers, Donald Trump, Trump, Trump Ceo Devin, Trumps, Stock-Telugu NRI

తిరోగమనం మధ్య సంస్థలో ట్రంప్ వాటా సోమవారం నాడు 1 బిలియన్లకు పైగా పడిపోయింది.ఈ సోషల్ మీడియా కంపెనీ గతేడాది 58.2 మిలియన్ల నష్టాన్ని వెల్లడించిన తర్వాత దాని ఆడిటర్ బీఎఫ్ బోర్గర్స్ ఆఫ్ కొలరాడో( BF Borgers of Colorado ) వ్యాపారాన్ని కొనసాగించగల సామర్ధ్యంపై సందేహం వ్యక్తం చేసిన తర్వాత ఇది జరిగింది.గత వారం సంస్థలో ట్రంప్ వాటా విలువ దాదాపు 4.88 బిలియన్లు.అయితే సోమవారం మార్కెట్ క్షీణత తర్వాత దాని విలువ సుమారు 3.83 బిలియన్లకు పడిపోయింది.ట్రేడింగ్ మొదటి రోజున స్టాక్ 30 శాతానికి పైగా జంప్ చేసింది.దీంతో ట్రంప్ షేర్లు 5.2 బిలియన్ డాలర్లకు పైగా వుంది.

Telugu Bfborgers, Donald Trump, Trump, Trump Ceo Devin, Trumps, Stock-Telugu NRI

కానీ ఆ ఊపు ఎంతోకాలం నిలవలేదు.ట్రూత్ సోషల్ స్టాక్( Truth Social Stock ) గత గురువారం 6 శాతం పైగా పడిపోయింది.సోమవారం 21 శాతం కోల్పోయి ట్రంప్ వాటా( Trump’s Shares ) విలువను 3.8 బిలియన్ డాలర్లకు తగ్గించింది.2022లో 1.47 మిలియన్ల నుంచి 2023లో 4.13 మిలియన్లకు అమ్మకాలు పెరిగినప్పటికీ, ట్రంప్ మీడియా కార్యకలాపాల పరిమిత స్థాయి, దాని నష్టాల పరిధిని గణాంకాలు హైలైట్ చేస్తున్నాయి.కొలరాడోకు చెందిన బీఎఫ్ బోర్గర్స్ సోమవారం కంపెనీ దాఖలులో నష్టాలు .దాని సామర్ధ్యంపై గణనీయమైన సందేహాన్ని లేవనెత్తుతున్నాయని పేర్కొంది.ఇతర సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలతో పోలిస్తే .ట్రంప్ ప్రమేయం కారణంగా ఇది ఎక్కువ నష్టాలను ఎదుర్కోవచ్చని ట్రంప్ మీడియా అంగీకరించింది.

ట్రంప్ మీడియా సీఈవో డెవిన్ న్యూన్స్( Devin Nunes ) మాట్లాడుతూ.

విలీనానికి సంబంధించిన 2023 ఆర్ధికాంశాలను మూసివేస్తే ట్రూత్ సోషల్‌కు ఎలాంటి రుణం లేదన్నారు.బ్యాంక్‌లో 200 మిలియన్ డాలర్లకు పైగా వుందని.మా ఫ్లాట్‌ఫాంను విస్తరించడానికి , మెరుగుపరచడానికి అనేక అవకాశాలను తెరిచిందని డెవిన్ చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube