వివేకం సినిమా( Vivekam ) ప్రదర్శనలపై ఏపీ హైకోర్టు తీవ్రంగా మండిపడింది.సెన్సార్ బోర్డు అనుమతి లేకుండా వివేకం సినిమాను ఎలా ప్రదర్శిస్తున్నారని న్యాయస్థానం ప్రశ్నించింది.
ఎన్నికల కమిషన్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఈ సినిమాను ఎలా ప్రదర్శిస్తున్నారని హైకోర్టు( AP High Court ) సీరియస్ అయింది.ఈసీ ఆదేశాలు కూడా ఖాతరు చేయరా అని న్యాయస్థానం ప్రశ్నించింది.
కాగా ఈ క్రమంలోనే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య( YS Vivekananda Reddy Murder Case ) కేసు నేపథ్యంలో తెరకెక్కిన రాజకీయ ప్రేరేపిత సినిమా అని న్యాయవాది శ్రవణ్ కుమార్ కోర్టుకు తెలిపారు.టీడీపీ( TDP ) ప్రయోజనాల కోసమే వివేకం సినిమా తీశారన్న న్యాయవాది ఐ-టీడీపీ ప్రోత్సాహంతోనే ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్( OTT Platforms ) లో ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు.
దీనిపై స్పందించిన హైకోర్టు వివేకం సినిమా ప్రదర్శనపై కేంద్ర ప్రభుత్వం, ఈసీల వివరణ తీసుకోవాలని సూచించింది.అదేవిధంగా త్వరలోనే దీనిపై ఉత్తర్వులు ఇస్తామన్న ధర్మాసనం విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.