వివేకం సినిమా ప్రదర్శనలపై ఏపీ హైకోర్టు సీరియస్

వివేకం సినిమా( Vivekam ) ప్రదర్శనలపై ఏపీ హైకోర్టు తీవ్రంగా మండిపడింది.సెన్సార్ బోర్డు అనుమతి లేకుండా వివేకం సినిమాను ఎలా ప్రదర్శిస్తున్నారని న్యాయస్థానం ప్రశ్నించింది.

ఎన్నికల కమిషన్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఈ సినిమాను ఎలా ప్రదర్శిస్తున్నారని హైకోర్టు( AP High Court ) సీరియస్ అయింది.

ఈసీ ఆదేశాలు కూడా ఖాతరు చేయరా అని న్యాయస్థానం ప్రశ్నించింది.కాగా ఈ క్రమంలోనే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య( YS Vivekananda Reddy Murder Case ) కేసు నేపథ్యంలో తెరకెక్కిన రాజకీయ ప్రేరేపిత సినిమా అని న్యాయవాది శ్రవణ్ కుమార్ కోర్టుకు తెలిపారు.

టీడీపీ( TDP ) ప్రయోజనాల కోసమే వివేకం సినిమా తీశారన్న న్యాయవాది ఐ-టీడీపీ ప్రోత్సాహంతోనే ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్( OTT Platforms ) లో ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు.

దీనిపై స్పందించిన హైకోర్టు వివేకం సినిమా ప్రదర్శనపై కేంద్ర ప్రభుత్వం, ఈసీల వివరణ తీసుకోవాలని సూచించింది.

అదేవిధంగా త్వరలోనే దీనిపై ఉత్తర్వులు ఇస్తామన్న ధర్మాసనం విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.

‘డుగ్గు డుగ్గు బుల్లెట్’ అంటూ హల్చల్ చేస్తోన్న వెన్నెల జయతి (వీడియో)