నేడు బంగ్లాదేశ్-ఆఫ్గనిస్తాన్ మధ్య పోరు..బంగ్లాదేశ్ కు చావో రేవో..!

ఆసియా కప్( Asia Cup ) టోర్నీలో భాగంగా పాకిస్తాన్ లోని లాహోర్ వేదికగా గ్రూప్ బి లో ఉండే బంగ్లాదేశ్-ఆఫ్గనిస్తాన్( Ban vs Afg ) మధ్య ఉత్కంఠ భరితమైన పోరు మధ్యాహ్నం 3:00 కు అట్టహాసంగా ప్రారంభం అవ్వనుంది.ఈ మ్యాచ్ బంగ్లాదేశ్ కు( Bangladesh ) ఎంతో కీలకం.

 Do Or Die Match For Bangladesh Against Afghanistan Asia Cup 2023 Details, Bangl-TeluguStop.com

ఒకవేళ ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ ఓడిపోతే ఆసియా కప్ టోర్నీ నుండి నేరుగా ఇక ఇంటికే.శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఘోరంగా ఓడిన బంగ్లాదేశ్ నేటి మ్యాచ్లో కచ్చితంగా గెలిస్తేనే సూపర్-4 అవకాశాలు సజీవంగా ఉండే అవకాశం ఉంది.

అలా కాకుండా ఓడితే ఆసియా కప్ నుండి నిష్క్రమించాల్సిందే.ఇలాంటి స్థితిలో బంగ్లాదేశ్ పై తీవ్ర ఒత్తిడి పెరిగింది.

ఇక ఆఫ్గనిస్తాన్( Afghanistan ) నేడు జరిగే మ్యాచ్ లో గెలిచిన, ఓడిన పర్వాలేదు.ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ కు మరో ఛాన్స్ ఉంటుంది.ఒకవేళ నేడు జరిగే మ్యాచ్లో బంగ్లాదేశ్ చేతిలో ఆఫ్ఘనిస్తాన్ ఓడిన.తరువాత జరిగే శ్రీలంక మ్యాచ్ పై గెలిస్తే నాకౌట్ కు చేరే అవకాశాలు ఉంటాయి.బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఇరు జట్లలోను ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడం వల్ల.బంగ్లాదేశ్ కు డూ ఆర్ డై మ్యాచ్ కావడం వల్ల ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది.

శ్రీలంక- బంగ్లాదేశ్( SL vs Ban ) మధ్య జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ 164 పరుగులకే ఆల్ అవుట్ అయింది.శ్రీలంక అద్భుతమైన చేజింగ్ చేసి బంగ్లాదేశ్ పై ఘన విజయం సాధించింది.శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ అటు బ్యాటింగ్ లోను, ఇటు ఫీల్డింగ్ లోను చాలా ఘోరంగా విఫలమైంది.బంగ్లాదేశ్ సూపర్-4 కు అర్హత సాదించాలంటే.నేడు జరిగే మ్యాచ్లో బ్యాటింగ్ లోను, ఫీల్డింగ్ లోను అద్భుత ఆటను ప్రదర్శించి ఆఫ్ఘనిస్తాన్ జట్టును సమర్ధవంతంగా ఎదుర్కొని విజయం సాధించాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube