ఈ విపత్తు సమయంలో ఒకరికి ఒకరు సాయం చేసుకోవాల్సిందిగా ప్రముఖులు పిలుపునిస్తున్నారు.ఇన్నాళ్లు మన కోసం నిలబడి మన ఎదుగుదలలో సాయంగా నిలిచిన కార్మికులకు ఇతరులకు సాయం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందంటూ ప్రముఖులు విజ్ఞప్తి చేస్తున్న సమయంలో సినీ ప్రముఖులు పలువురు తమవంతు సాయంను తమ వారికి, ఇతరులకు చేసేందుకు ముందుకు వస్తున్నారు.
అయితే ఎప్పుడు ఏదో ఒక నాటకం వేస్తే కాని పూట గడవని సురభి కంపెనీ ఆర్టిస్టులు తీవ్ర అవస్థలు పడుతున్న నేపథ్యంలో వారికి సాయం చేసే వారు కరువయ్యారు.
సోషల్ మీడియాలో వారి గురించి వచ్చిన ఒక కథనంను చూసిన దర్శకుడు హరీష్ శంకర్ వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు.
వారికోసం పెద్ద ఎత్తున బియ్యం ఇంకా నిత్యావసర వస్తువులను పంపించాడు.దర్శకుడు ఇచ్చిన నిత్యావసర వస్తువులను సురభి కంపెనీ వారికి స్వచ్చంద సంస్థ పంచి పెట్టింది.ఈ సమయంలో సురభి సంస్థ వారిని ఆదుకోవడంపై సినీ వర్గాల వారితో పాటు నెటిజన్స్ ఇంకా ప్రేక్షకులు హరీష్ శంకర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

సురభి వారిని ఆదుకునేందుకు ఇంకా ఇండస్ట్రీ నుండి పలువురు ముందుకు రావాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.వందలాది మంది సురభి కంపెనీ వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు.వారంతా కూడా ఆకలితో అలమటిస్తున్న ఈ సమయంలో సెలబ్రెటీలు తమకు తోచిన సాయం చేసి వారిని ఆదుకోవాలంటూ స్వచ్చంద సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇప్పటి వరకు టాలీవుడ్ నుండి హరీష్ శంకర్ మాత్రమే వారికి సాయం చేశాడు.ముందు ముందు మరింత మంది సాయం చేస్తారని ఆశిద్దాం.